నిర్మాతగా ఇర్ఫాన్‌ఖాన్...
నటుడిగా 2015లో అందరి కంటే ఎక్కువ మార్కులు కొట్టేసిన ఇర్ఫాన్‌ఖాన్ ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తున్నాడు. నిర్మాతగా మారి తన అభిరుచి చాటుకోనున్నాడు. ఎవరితోనో తెలుసా? ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్‌తో కలిసి. మీరా నాయర్ తన మేనల్లుడు ఇషాన్ నాయర్ దర్శకుడిగా ఒక సినిమా తీయనుంది. ఈ కథ ఇర్ఫాన్‌ఖాన్‌కు నచ్చింది. తాను కూడా సహ నిర్మాతగా మారి భాగం పంచుకుంటున్నాడు. ‘నేను నిర్మించే సినిమా తాజా కథతో ఉండాలనుకున్నాను.
ఈ కథ అలాంటిదే’ అన్నాడతను. సినిమా పేరు ‘కాష్’ (బహుశా). ఇందులో ‘దేవ్ డి’, ‘జిందగీ న మిలేగీ దొబారా’ ఫేమ్ కల్కి ముఖ్యపాత్ర పోషిస్తోంది. ‘నిర్మాతగా నేను డబ్బు లెక్కలు చూసుకోకపోయినా సృజనాత్మక విషయాల్లో మంచి సలహాలు ఇవ్వగలను’ అంటున్నాడు ఇర్ఫాన్. ‘పికు’, ‘జురాసిక్ వరల్డ్’ వంటి సినిమాలతో ఇర్ఫాన్ అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఎంతగా అంటే ఇతడు జపనీస్‌లో ఒక టెలివిజన్ షో కూడా చేయబోతున్నాడు. ఎక్కడ తను పుట్టిన రాజస్తాన్‌లో ఎడారి ప్రాంతం. ఎక్కడ జపాన్! ప్రతిభను ఎవరూ ఆపలేరు అనడానికి ఇదే ఉదాహరణ.
బాలీవుడ్ బాత్