అన్నీ తింటేనే ఆరోగ్యమా?
సెల్ఫ్‌చెక్
మోడరన్ లైఫ్ స్టయిల్‌లో అన్ని పదార్థాలూ అందుబాటులో ఉంటున్నాయి. ప్రాంతాలు, కాలాలతో పని లేకుండా ఎప్పుడు దేనిని తినాలంటే దానిని తినవచ్చు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? ఎలా తినాలి? అన్నది ప్రశ్నార్థకం. మనం సరిగ్గా తింటున్నామా?
1. విటమిన్లు శరీరానికి శక్తినివ్వవని, బాడీ మెటబాలిక్ ప్రాసెస్‌కు తోడ్పడతాయని తెలుసు. విటమిన్లతోపాటు శక్తినిచ్చే ఆహారాన్నీ తీసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
2. ఆరోగ్యకరంగా తినడం అంటే అన్నిరకాల ఆహారాన్ని సమన్వయం చేసుకుంటూ సమతులంగా తీసుకోవడమే.
ఎ. అవును బి. కాదు
3. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా శక్తిమంతంగా ఉంటుందని మీ అభిప్రాయం.
ఎ. అవును బి. కాదు
4. రెండవ, మూడవ అంశాలను పాటిస్తుంటే ఆరోగ్యకరంగా బరువు పెరుగుతూ, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండవచ్చని నిపుణులు చెబుతారు.
ఎ. అవును బి. కాదు
5. వెన్న తీయడం ద్వారా పాలలో క్యాల్షియం మోతాదు తగ్గదని తెలుసు.
ఎ. అవును బి. కాదు
6. చికెన్, మాంసం, చేపలు, పాలు, పెరుగు, వెన్న, గుడ్లు వంటి జంతువుల ఉత్పత్తులలో కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
7. నువ్వుల నూనె, సన్‌ఫ్లవర్, ఆలివ్ ఆయిల్ వంటి పాలీ అన్‌సాచురేటెడ్ ఆయిల్, మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్ ఉండే నూనెలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
ఎ. అవును బి. కాదు
8. కొబ్బరి నూనె, పామ్ ఆయిల్‌లో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్, ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొలెస్ట్రాల్‌తో కలిసి ఫ్యాటీ యాసిడ్లుగా రూపాంతరం చెంది కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతాయని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే ఆరోగ్యంగా ఉండడం, ఆహారం తీసుకోవడం మీద మీకు ఆసక్తి ఉందనుకోవాలి. ఆహారాన్ని రుచికోసం కాకుండా శరీరం పని చేయడానికి ఇంధనాన్ని సమకూరుస్తున్నామని భావించండి.