రారండోయ్‌... | Literature Events In Andhra Pradesh And Telangana | Sakshi
Sakshi News home page

రారండోయ్‌...

Published Mon, Jan 13 2020 12:40 AM | Last Updated on Mon, Jan 13 2020 12:44 AM

Literature Events In Andhra Pradesh And Telangana - Sakshi

  • డాక్టర్‌ మోటుపల్లి చంద్రవళ్లి ‘జానపద సాహిత్యము–సీత’ ఆవిష్కరణ జనవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై బీచ్‌ రోడ్డులోని మద్రాసు విశ్వవిద్యాలయంలో జరగనుంది. మాడభూషి సంపత్‌కుమార్, ఎల్‌.బి.శంకరరావు, మోటుపల్లి గిరి హనుమంతరావు, పరిమి ప్రసాదరావు, నిర్మలా పళణివేలు, గుడిమెట్ల చెన్నయ్య పాల్గొంటారు.
  •  సాహితీ మాణిక్యం పురస్కారాన్ని ఈ ఏడాది దేవిప్రియ, సి.మృణాళినికి ప్రదానం చేయనున్నారు. జనవరి 16న ఖమ్మంలో ప్రదానం ఉంటుందని వ్యవస్థాపకులు ఆర్‌.వెంకటేశ్వర్లు, ఆర్‌.శ్రీనివాసరావు, ఆర్‌.సీతారాం తెలియజేస్తున్నారు. జూలూరి గౌరీశంకర్, శిఖామణి, యాకూబ్, వంశీకృష్ణ పాల్గొంటారు.
  •   కోడూరి విజయకుమార్‌ ‘రేగుపండ్ల చెట్టు’, దేశరాజు ‘దుర్గాపురం రోడ్‌’ కవితా సంపుటాల పరిచయ సభ జనవరి 19న సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని శిఖర స్కూల్‌లో జరగనుంది. వక్తలు: చినుకు రాజగోపాల్, శ్రీరాం పుప్పాల, వాడ్రేవు చినవీరభద్రుడు, అనిల్‌ డ్యాని. నిర్వహణ: సాహితీ మిత్రులు.
  • సాహితీ సృజనలో ఏనుగు నరసింహారెడ్డి మూడు దశాబ్దాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తేనున్న ‘ప్రవాహం’ సంచికకు ఫిబ్రవరి 15లోగా జ్ఞాపకాలు, వ్యాసాలను పంపాల్సిందిగా డాక్టర్‌ గంటా జలంధర్‌ రెడ్డి కోరుతున్నారు. వాట్సాప్‌ కోసం: 9848292715
  •  పాలమూరు సాహితీ అవార్డు కోసం 2019లో వచ్చిన కవితాసంపుటాల మూడు ప్రతులను జనవరి 30లోగా పంపాల్సిందిగా కోరుతున్నారు. నగదు రూ. 5,116. చిరునామా: భీంపల్లి శ్రీకాంత్, 8–5–38, టీచర్స్‌ కాలనీ, మహబూబ్‌నగర్‌–509001.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement