► ధనికొండ హనుమంతరావు శతజయంతి వేడుకలు, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 16న రోజంతా జరగనున్నాయి. ధనికొండ పుస్తకాల ఆవిష్కరణ జరగనుంది. ఆవిష్కర్త: కె.శ్రీనివాస్.
► నరేష్‌కుమార్ సూఫీ కవిత్వ సంపుటి ‘నిశ్శబ్ద’ పరిచయ సభ డిసెంబర్ 17న సా. 6 గం.కు రవీంద్రభారతి మినీ హాల్‌లో జరగనుంది. అధ్యక్షత: విజయ్ కుమార్ కోడూరి.
► అఫ్సర్ 40 ఏళ్ల సమగ్ర కవిత్వం ‘అప్పటినుంచి ఇప్పటిదాకా’ ఆవిష్కరణ సభ డిసెంబర్ 20న సా. 5 గంటలకు సాలార్‌జంగ్ మ్యూజియం లెక్చర్ హాల్‌లో జరగనుంది. ప్రచురణ: చిత్రలేఖ పబ్లికేషన్స్.
► నామిని సుబ్రమణ్యం నాయుడు సంపాదకత్వం వహిం చిన ‘ఒక ఆలోచన, ఒక అవలోకన’ పుస్తకాన్ని భూమన కరుణాకరరెడ్డి డిసెంబర్ 20న సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో ఆవిష్కరిస్తారు. ప్రచురణ: వరదరాజ నగర్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ. నిర్వహణ: మానవ వికాస వేదిక.
► చరిత్ర ఆధారిత కాల్పనిక సాహిత్యంపై సాయి పాపినేని రచనల నేపథ్యంలో చర్చ డిసెంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు హుస్సేన్ సాగర్లో, తెలంగాణ టూరిజం వారి బోటులో జరగనుంది. సుధాకర్ ఉణుదుర్తి, మహమ్మద్ ఖదీర్‌బాబు, జ్యోతి పి. వక్తలు. సమన్వయం: నరేశ్ నున్నా. రిజిస్ట్రేషన్ కొరకు: 9845034442
► రివాజు: తెలంగాణ కథ–2018 ఆవిష్కరణ డిసెంబర్ 22న ఉదయం 10:30కు హన్మకొండలోని రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయంలో జరగనుంది. సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్. ఆవిష్కర్త: బన్న అయిలయ్య. నిర్వహణ: సృజన లోకం, సింగిడి.
► శివే గారి ‘కరిగిపోవే కన్నీటి చుక్క’ ఆవిష్కరణ డిసెంబర్ 22న హైదరాబాద్, చింతల్ సిద్దార్థ పాఠశాలలో ప్రముఖుల చేతులమీదుగా జరగనుంది.
► సింగమనేని నారాయణ పేరుతో ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారానికి జనవరి 2018 నుండి డిసెంబరు 2019 వరకు ప్రచురించిన కథల సంపుటులను ఆహ్వానిస్తున్నారు. పురస్కార నగదు పదహారు వేలు. సంపుటాల మూడు ప్రతుల్ని జనవరి 15 లోగా పంపాల్సిన చిరునామా: అధ్యక్షులు, ఏరువాక సాహిత్య సాంస్కృతిక సంస్థ, 7–1–507, ఎన్జీవో కాలనీ, బద్వేల్–516227. వైఎస్‌ఆర్ కడప. ఫోన్: 7013736729
► నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాలలో జరగనున్నాయి. కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారంతో ‘ప్రపంచ తెలుగు రచయితల సంఘం 2019’ ఈ సభలను నిర్వహిస్తోంది. గౌరవాధ్యక్షులు: మండలి బుద్ధప్రసాద్. తెలుగుకు సంబం ధించిన పలు అంశాలు చర్చకు రానున్నాయి. వివరాలకు: pట్చp్చnఛిజ్చ్టి్ఛ uజu.ఛిౌఝ వెబ్‌సైట్ చూడొచ్చు. కార్యదర్శి డాక్టర్ జి.వి.పూర్ణచందు ఫోన్: 9440172642
► డా.పసునూరి రవీందర్ సాహిత్య విమర్శ సంపుటాలు ఇమ్మతి, గ్లోబలైజేషన్ ఆవిష్కరణ సభ ఈ నెల 21న రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్ నందు జరుగును. ఆవిష్కర్త: డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నిర్వహణ: సింగిడి.
రారండోయ్
Published Mon, Dec 16 2019 12:07 AM | Last Updated on Mon, Dec 16 2019 12:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment