సుదీర్ఘ మృదంగ విన్యాసం
తిక్క లెక్క
సాధారణంగా కచేరీలు ఎంతసేపు జరుగుతాయి..? మహా అయితే రెండు మూడు గంటలు. ప్రత్యేక సందర్భాల్లో అక్కడక్కడా నిర్వహించే బృంద కచేరీలైతే ఒక్కోసారి ఇరవై నాలుగు గంటల సేపు కూడా అరుదుగా జరుగుతుంటాయి. అయితే, ఒకే మనిషి ఏకధాటిగా ఇరవై ఒక్క రోజులు కచేరీ చేయడం సాధ్యమేనా..? అసాధ్యం అనుకుంటున్నారా..?
ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు కేరళకు చెందిన యువ మృదంగ విద్వాంసుడు కుళల్‌మన్నం గోపాలకృష్ణన్ రామకృష్ణన్. కర్ణాటక సంగీత కచేరీల్లో ఎక్కువగా పక్కవాద్యంగా ఉండే మృదంగంతో ఏకంగా 501 గంటల సేపు సోలో కచేరీ నిర్వహించి గిన్నెస్ రికార్డు సాధించాడు.