
ప్రపంచసుందరి పాదాల ముందు రెడ్ కార్పెట్ చుట్టను పడేసి... దాన్ని చుట్లు విప్పుతూ... విప్పుకుంటూ పోతే... దాని రెండో అంచు బాలీవుడ్ పరిశ్రమ దగ్గర పూర్తవుతుందని ఓ లెక్క. ఇటీవలే ప్రపంచసుందరిగా ఎంపికైన మానుషీ ఛిల్లర్‌కూ ఇదే విధంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ లభించవచ్చనే మాట వినిపిస్తోంది.
గతంలోనూ మిస్ ఇండియా, మిస్ వరల్డ్‌లకు ఎంపికైన చాలామంది సుందరీమణుల్లాగే ఇటీవల మిస్ వరల్డ్‌గా ఎంపికైన మానుషీ ఛిల్లర్ కూడా త్వరలో బాలీవుడ్ గడప తొక్కడానికి వడివడిగా అడుగులేస్తోందట. ‘మిస్ వరల్డ్’ పోటీల సందర్భంగా నిర్వహించిన టాలెంట్ రౌండులో ఆమె ‘గోలీయోం కీ రాస్‌లీలా – రామ్‌లీలా’ సినిమాలోని ‘నగాడా నగాడా’ అనే పాటను ప్రదర్శించింది.
చదువుతున్న కోర్సు పరంగా చూస్తే కత్తులూ కటార్లూ పట్టుకొని సర్జరీలూ– చికిత్సలు చేయాల్సిన ఎంబీబీఎస్ విద్యార్థిని మానుషి... ఎప్పుడు నటిగా మారి థిం తడాక్... థిం తడాక్... అంటూ ఆ పాటలోలా డాన్స్ చేస్తూ తన తడాఖా చూపిస్తుందా? అని సమస్త సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment