కొత్త పుస్తకాలు
సదానంద్ శారద కథలు
పేజీలు: 276; వెల: 180; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, జి.ఎస్.ఐ. పోస్టు, బండ్లగూడ(నాగోల్), హైదరాబాద్–68. ఫోన్: 24224453
అర్ధాంగి పేరును తనకు జోడించుకున్న కథకుడు సదానంద్ శారద. ‘ఒక ప్రభుత్వం దేశాన్ని పాలించగలదేమో కాని సమాజాన్ని పాలించలేదు. సమాజాన్ని ప్రభావితం చేసేదీ, సంస్కరించేదీ సాహిత్యం’ అని నమ్ముతారు. ఆ లక్ష్యంతోనే ఆయన 1970, 80ల్లో కథలు రాశారు. 30 కథలతో ఈ సంకలనాన్ని నవచేతన అందుబాటులోకి తెచ్చింది.
తలకిందుల లోకం
మూలం: మనీషా సేఠి ‘కాఫ్కాలాండ్’; తెలుగు: ఆర్.శశికళ; పేజీలు: 168; వెల: 150; ప్రచురణ: మలుపు, 2–1–1/5, నల్లకుంట, హైదరాబాద్–500044. ఫోన్: 9866559868
‘తలకిందుల లోకం కౌంటర్ టెర్రరిజానికి ఉన్న చీకటి కోణాలను వెలికి తీస్తుంది. ముంబై నుండి బెంగళూరు దాకా, ఢిల్లీ నుండి మధ్యప్రదేశ్ దాకా ఉన్న చాలా ముఖ్యమైన కేసులను పరిశీలించి, టెర్రర్ కేసుల విచారణ అంటే ఏదో ఒక మేరకు చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదనీ, తామేమి చేసినా ఎవ్వరూ ఏమీ అనరనే భరోసాతో ముందే ఏర్పరుచుకున్న దురభిప్రాయాలతో, క్రూరహింసను అమలుపరచడమనీ రచయిత నిరూపిస్తుంది’. అయితే అనువాదం మరింత సాఫీగా ఉండాల్సింది.
అల్మార
1917 అక్టోబరు విప్లవం ఎందుకు పోయింది?
సోవియట్ రష్యాలో ఏం జరిగింది?
చార్లెస్ బెతల్‌హామ్ రాసిన ‘క్లాస్ స్ట్రగుల్స్ ఇన్ ది యు.ఎస్.ఎస్.ఆర్.’ అనే 4 సంపుటాల సంక్షిప్త పరిచయం: రంగనాయకమ్మ; పేజీలు: 456(రాయల్ సైజులో, హార్డ్‌బౌండుతో); వెల: 100; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ–520002. ఫోన్: 0866–2431181
సుప్రసిద్ధ వ్యక్తుల జీవితాల్లో అప్రసిద్ధ గాథలు
రచన: కోడూరి శ్రీరామమూర్తి; పేజీలు: 118; వెల: 70; ప్రచురణ: క్లాసిక్ బుక్స్, 32–13/2–3ఎ, అట్లూరి పరమాత్మ స్ట్రీట్, మొగల్‌రాజపురం, విజయవాడ –520010. ఫోన్: 9866115655
ఆలోచించండి
రచన: అనిశెట్టి ఆనంద స్వరూప్; పేజీలు: 130; వెల: 100; ప్రచురణ: సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, 1–225, సుసర్ల కాలనీ, బాజీ జంక్షన్, గోపాలపట్నం, విశాఖపట్నం–530027. ఫోన్:
0891–2716225