
ఆగస్టు 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
సునీల్ షెట్టి (నటుడు); జాక్విలిన్ ఫెర్నాండెజ్ (నటి)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య. వీరు పుట్టిన తేదీ 11. ఇది ఒక మాస్టర్ నంబర్. ఈ తేదీన పుట్టిన వారికి ఆత్మవిశ్వాసంతోపాటు మంచి సమయస్ఫూర్తి, దైవభక్తి ఉండటం వల్ల జీవితంలో అన్ని అడ్డంకులను అవలీలగా అధిగమిస్తారు. చంద్ర, కుజుల కలయికతో చంద్రమంగళ యోగం ఏర్పడటం వల్ల ఆస్తులు అభివృద్ధి చేసు కుంటారు, విదేశీ ప్రయాణాలు చేయాలనే కోరిక నెరవేర్చుకోవడం లేదా విదేశాలలో ఉన్న బంధుమిత్రుల సాయంతో జీవితంలో నిలదొక్కుకుంటారు. కుజుని ప్రభావం వల్ల ఆవేశానికి గురై, దూకుడుగా ప్రవర్తిస్తారు.
అందువల్ల వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండటం, చిన్న చిన్న వ్యవహారాలకు కూడా కోర్టులకు, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. మరోటి దొరికే వరకూ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోకుండా ఉండటం మంచిది. రాజకీయ నాయకులు లేదా పలుకుబడి గలవారితో ఏర్పడిన పరిచయాలు జీవితంలో చాలా ఉపయోగపడతాయి. లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు; లక్కీ కలర్స్: రెడ్ , రోజ్, ఆరంజ్, వైట్, సిల్వర్; సూచనలు: సుబ్రహ్మణ్యారాధన, రోగులకు సాయం చేయడం, రక్తదానం చేయడం లేదా ప్రోత్సహించడం, దుర్గామాతను ఆరాధించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్