ఆగస్టు 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On August 3, the birthday celebrated | Sakshi
Sakshi News home page

ఆగస్టు 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Sun, Aug 2 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

ఆగస్టు  3న  పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఆగస్టు 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సునిల్ ఛెత్రి (పుట్‌బాల్ క్రీడాకారుడు), వాణిశ్రీ (నటి)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల ధైర్యం, సహనం, కొత్త ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల అంకిత భావం కలిగి ఉండటం వంటి  లక్షణాలుంటాయి. పుట్టిన తేదీ 3 దేవగురువైన బృహస్పతికి సంబంధించింది కావడం వల్ల నిశిత పరిశీలన, కుశాగ్రబుద్ధి, సృజనాత్మకత కలిగి ఉండి, మేధావిగా గుర్తింపబడతారు. మీ సంవత్సర సంఖ్య 1. ఇది పరిపూర్ణతకు, సంతృప్తికి, కార్యసిద్ధికి చిహ్నం.

అందువల్ల అనుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.  సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తులు సమకూర్చుకుంటారు. ప్రేమికులు జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయమిది. కోర్టుకేసులు, న్యాయసంబంధమైన వివాదాలు ఉన్న వారు కొంచెం సంయమనం పాటించాలి.
 
లక్కీ నంబర్స్: 1,3,5,9; లక్కీ కలర్స్: ఎల్లో, రోజ్, పర్పుల్, గోల్డెన్, శాండల్. లక్కీ డేస్: మంగళ, గురు, ఆదివారాలు; సూచనలు: సాయిబాబాను, దత్తాత్రేయిడిని ఆరాదించడం, దక్షిణామూర్తి స్తోత్రం, ఆదిత్యహృదయపారాయణం చేయడం, తోబుట్టువులను ఆదరించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement