
జూలై 8న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
సౌరవ్ గంగూలీ (క్రికెటర్), రేవతి (నటి)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5 బుధగ్రహానికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఇది జీవితంలో సంతోషకరమైన సంవత్సరంగా గుర్తుండిపోతుంది. మంచి మార్పు, అనుకోని మంచి అవకాశాలు వచ్చి అన్ని విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి, వృత్తిపరంగా, కుటుంబ పరంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక భద్రత, స్నేహసంబంధాలు పెంపొందుతాయి. శారీరక శ్రమతో కాకుండా బుద్ధిబలంతో, విజ్ఞతతో ఆలోచించి, నేర్పుగా పనులు సాధిస్తారు. ఉద్యోగులు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచుకుంటారు. పోటీపరీక్షలు రాసేవారు విజయాన్ని సాధిస్తారు.
అయితే మీ డేటాఫ్ బర్త్‌లో 8 ఉన్న కారణంగా అనుకోని విరోధాలు, అపార్థాలు, అవమానాలు జరిగే అవకాశం ఉంది. ఓపిక పట్టడం మంచిది. మీరు జులై నెలలో పుట్టడం వల్ల సహజసిద్ధమైన మానసిక, ఆధ్యాత్మిక శక్తి ఉండటం వల్ల అన్నింటినీ అధిగమించి, శత్రువుల మన్ననలు కూడా పొందుతారు. కామర్స్, లా, మేనేజ్‌మెంట్, అకౌంట్స్ రంగాల వారికి ఇది చాలా మంచి సమయం. ప్రమోషన్లు, గౌరవమర్యాదలు పొందే అవకాశం. లక్కీ నంబర్స్: 1,3,5,8; లక్కీ కలర్స్: బ్లూ, గ్రీన్, క్రీమ్, ఎల్లో, పర్పుల్; లక్కీ డేస్: బుధ, శుక్ర, శని వారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివారాధన, అనాథలకు అన్నపానాదులతోపాటు ఆశ్రయం ఇవ్వడం, పేద విద్యార్థులకు చదువుకోవడానికి సాయం చేయడం మంచిది.
- రెహమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్