గుమ్మడి గింజలు సమకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ గుమ్మడినే కొందరు కూరగుమ్మడి లేదా మంచి గుమ్మడి అని కూడా పిలుస్తారు. గుమ్మడి గింజలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని...
∙గుమ్మడి గింజలు కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి ∙గుమ్మడి గింజల్లో çపనాగమిక్ ఆసిడ్ అనే పోషకం ఉంటుంది. దీన్నే పనాగమేట్, విటమిన్ బి–15 అని కూడా అంటారు. ఇది జీవకణంలో జరిగే వాయువుల మార్పిడి (సెల్ రెస్పిరేషన్) సక్రమంగా జరిగేలా చేస్తుంది∙గుమ్మడి గింజలు కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ∙గుమ్మడి గింజల్లో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్... ఫ్రీ రాడికల్స్ దుష్ప్రభావాన్ని హరించి వేస్తాయి ∙గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, రక్తం గాఢత (పీహెచ్)ను క్రమబద్ధం చేస్తాయి, ఒత్తిడిని నివారించడానికి దోహదపడతాయి.
గుమ్మడి గింజలు ఎక్కువగా తింటూ ఉంటే ఎప్పుడూ ఏదో తినాలనే కాంక్ష (క్రేవింగ్) తగ్గుతుంది. అందుకే బరువు పెరగకుండా చూసుకోవాలని జాగ్రత్తపడేవారు ఈ గుమ్మడి గింజలను తీసుకొని స్థూలకాయం బారిన పడకుండా కాపాడుకోవచ్చు ∙ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇవి తోడ్పడతాయి ∙గుమ్మడి గింజలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆర్థరైటిస్ ముప్పును తగ్గిస్తాయి.
కండరాల ఆరోగ్యాన్ని కాపాడే గుమ్మడి గింజలు!
Published Tue, Nov 14 2017 11:57 PM | Last Updated on Tue, Nov 14 2017 11:57 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment