Pumpkins
-
Health Tips: ఇవి తింటే బీపీ అదుపులో ఉంటుంది!
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు. దీనిని ఆహారంతోనే అదుపు చేయవచ్చు. గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. మీకు తెలుసా? తల తిరగడం కూడా గుండె వైఫల్యానికి సంకేతం. డీ హైడ్రేషన్ వల్ల మైకం వచ్చి గుండె పనిచేయదు. గొంతు లేదా దవడలో నొప్పి కూడా గుండెపోటుకు సంకేతం. అయితే అన్ని నొప్పులు గుండెనొప్పులకి కారణమని చెప్పలేం. కొన్నిసార్లు ఇది జలుబు లేదా సైనస్ కారణంగా వస్తుంది. కానీ కొన్నిసార్లు ఛాతీ నొప్పి గొంతు నుంచి దవడకు వ్యాపిస్తుంది. ఇది చాలా ప్రమాదం. మీరు చాలా త్వరగా అలసిపోయినట్లనిపిస్తే బలహీనతగా భావించకండి. ఎందుకంటే ఇది కూడా గుండెపోటుకు కారణమయ్యే లక్షణాలలో ఒకటని గుర్తుంచుకోండి. చదవండి: చెమట కాయలా? చందనం పొడి, వట్టివేళ్ల పొడిని రోజ్‌వాటర్‌లో కలిపి.. -
కండరాల ఆరోగ్యాన్ని కాపాడే గుమ్మడి గింజలు!
గుమ్మడి గింజలు సమకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ గుమ్మడినే కొందరు కూరగుమ్మడి లేదా మంచి గుమ్మడి అని కూడా పిలుస్తారు. గుమ్మడి గింజలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని... ∙గుమ్మడి గింజలు కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి ∙గుమ్మడి గింజల్లో çపనాగమిక్ ఆసిడ్ అనే పోషకం ఉంటుంది. దీన్నే పనాగమేట్, విటమిన్ బి–15 అని కూడా అంటారు. ఇది జీవకణంలో జరిగే వాయువుల మార్పిడి (సెల్ రెస్పిరేషన్) సక్రమంగా జరిగేలా చేస్తుంది∙గుమ్మడి గింజలు కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ∙గుమ్మడి గింజల్లో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్... ఫ్రీ రాడికల్స్ దుష్ప్రభావాన్ని హరించి వేస్తాయి ∙గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, రక్తం గాఢత (పీహెచ్)ను క్రమబద్ధం చేస్తాయి, ఒత్తిడిని నివారించడానికి దోహదపడతాయి. గుమ్మడి గింజలు ఎక్కువగా తింటూ ఉంటే ఎప్పుడూ ఏదో తినాలనే కాంక్ష (క్రేవింగ్) తగ్గుతుంది. అందుకే బరువు పెరగకుండా చూసుకోవాలని జాగ్రత్తపడేవారు ఈ గుమ్మడి గింజలను తీసుకొని స్థూలకాయం బారిన పడకుండా కాపాడుకోవచ్చు ∙ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇవి తోడ్పడతాయి ∙గుమ్మడి గింజలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆర్థరైటిస్ ముప్పును తగ్గిస్తాయి. -
సైజులో పెద్దన్న
తిండిగోల తెలుగువారికి ఇష్టమైనది, కూరగాయలన్నింటిలోకీ అతి పెద్ద పరిమాణం కలిగినదీ గుమ్మడి. పులుసులో గుమ్మడి ముక్కలు వేస్తే ఆ రుచే అదుర్స్. హిందువులు గృహప్రవేశం, దిష్టితీయడం వంటి కార్యాలలో గుమ్మడి పెద్ద పాత్రే పోషిస్తుంది. తమిళంలో పూషిణి అని, కన్నడంలో కుంబల అని, హిందీలో ఖద్దూ అని, సంస్కృతంలో కూష్మాండమనీ, ఆంగ్లంలో పంప్కిన్ అనీ పిలుచుకునే గుమ్మడి ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ పండుతుంది. భారతదేశ సంప్రదాయక వంటకాలలో గుమ్మడికి మంచి స్థానమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతి ప్రాచీన కాలం నుంచి ఉన్న గుమ్మడిలోని వివిధ పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండటం వల్ల ఆయుర్వేదమందుల తయారీలో విరివిగావాడతారు. ఎన్నో రకాల విటమిన్లు, మినరల్సు కలిగి ఉన్న గుమ్మడి గింజలను తినడం చాలా మంచిదని అల్లోపతి వైద్యులు కూడా చెబుతారు. గుమ్మడిపండునే కాదు, వాటి లేత ఆకులు, కాండం, పూలు కూడా కూరకు వాడుకుంటారు. అయితే కొంచెం పైత్యం కలిగించే గుణం కలిగినందువల్ల దీనిని మితంగానే తీసుకోవడం మంచిదని ఆయుర్వేద వైద్యులు హెచ్చరిస్తారు. గొబ్బెమ్మలకు అలంకరించే పూలలో గుమ్మడి పువ్వుదే అగ్రస్థానం. అన్నట్టు గుమ్మడి డొల్లతో వీణ, తంబూరా వాంటి వాద్యపరికరాలు కూడా తయారు చేస్తారు. బూడిద గుమ్మడి, మంచి గుమ్మడి అని రెండు రకాలున్న గుమ్మడిలో రెండింటిలోనూ ఇంచుమించు సమానమైన ఔషధ విలువలున్నాయి. కూరలు, పులుసుల్లో, స్వీట్ల తయారీలో రెండింటినీ వాడతారు. కానీ మంచిగుమ్మడికి మరింత మంచిస్థానం ఉంది. -
ఇసుక దిబ్బల్లోనూ..!
‘తివిరి ఇసుక నుంచి తైలం తీయవచ్చు..’ అంటారు. తైలం విషయం ఏమోగాని.. బంగ్లాదేశ్‌లో ఇసుక దిబ్బలు, వరదల కారణంగా ఇసుక మేట వేసిన పొలాల్లో చక్కని పంటలు పండిస్తున్నారు. భారీ టెక్నాలజీ, ఖరీదైన సదుపాయాల వంటివేమీ అక్కర్లేదు. ఎక్కువ కాలం నిల్వ ఉండే గుమ్మడి కాయలు పండిస్తే ఆహార భద్రతకు ఢోకా ఏముంది? 1. ఇసుకలో మీటరు లోతు, వైశాల్యం గల గుంత తవ్వాలి. 2. ఒక గోనె సంచిని తీసుకొని కంపోస్టు లేదా ఘనజీవామృతం కలిపిన మట్టి మిశ్రమంతో నింపాలి. కొన్ని రోజుల తర్వాత దాన్ని ఇసుక గుంతలో బల్లపరుపుగా పెట్టాలి. కంపోస్టులో నాలుగు నుంచి ఆరు వరకు ఏవైనా విత్తనాలను విత్తుకోవాలి. 3. ఆ తరువాత ఐదు నెలలు ఈ గోతులను జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ప్రతి గుంత నుంచి ఫలసాయం లభిస్తుంది.