ఇంటి చిట్కాలు
బియ్యం పురుగుపట్టకుండా...
మిక్సీలో బ్లేళ్లు పదునుగా ఉండాలంటే కొంచెం రాతి ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి. ఇలా నెలకొకసారి చేస్తే బ్లేళ్లు పదునుగా ఉంటాయి. {ఫిజ్ దుర్వాసన వేస్తుంటే గిన్నెలో కాఫీగింజలు వేసి మొదటి షెల్ఫ్‌లో పెడితే వాసన పోతుంది. పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం బస్తాలో వెల్లుల్లి రెబ్బలు లేదా లవంగాలు వేయాలి.
కొత్తిమీర, పుదీనా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పలుచని బట్టలో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. దిండు గలీబులకు నూనె మరకలుంటే బంగాళదుంప ముక్కతో రుద్ది ఉతికితే మరకలు తేలిగ్గా పోతాయి. సీసాలను కడగడం కష్టంగా ఉంటే లోపల కాసిన్ని బియ్యం పోసి కొంచె వేడినీళ్లు పోసి మూత పెట్టి షేక్ చేస్తే శుభ్రం అవుతుంది.