కంటిచుట్టూ వలయాలా? | Rings around the eyes? | Sakshi
Sakshi News home page

కంటిచుట్టూ వలయాలా?

Published Thu, Oct 3 2013 12:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

కంటిచుట్టూ వలయాలా?

కంటిచుట్టూ వలయాలా?

విశాలమైన నేత్రాలు, మిలమిలలాడుతూ ఉంటే ముఖారవిందం ముచ్చటగొలుపుతుంది. మేని సౌందర్యం కంటి భాష ద్వారే ఎదుటివారికి తెలుస్తుంది. కనులు అలసటగా, చుట్టూ నల్లని వలయాలుగా ఉంటే వయసు పైబడినట్టుగా కనిపిస్తుంది. అందుకే మేకప్‌కన్నా ముందుగా కళ్లను కాంతివంతంగా మార్చుకోవడం ఎలాగో తెలిసుండాలి.
 
 కంటి చుట్టూ చర్మం


 నల్లటి వలయాలు తగ్గడం కోసం ప్రతిరోజూ కంటి చుట్టూ యాంటీ ఏజింగ్ క్రీమ్, సీరమ్, ఫౌండేషన్‌ల వాడకం తప్పనిసరి కాదు.
     
 బయటకు వెళ్లేముందు యువి-ప్రొటెక్టివ్ సన్‌గ్లాసెస్ తప్పక వాడాలి. ఇది వైద్యుల సూచన కూడా! ఎలాంటి సంరక్షణ లేకుండా ఎక్కువసేపు ఎండ, గాలికి వున్నా కంటి చుట్టూ చర్మ కణాలు దెబ్బతింటాయి. ఎండలోకి వెళితే సన్‌స్క్రీన్ రాసుకోవాలి కదా అని కళ్ల చుట్టూ రాయకూడదు. ఇందుకోసం మినరల్ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి లేదా వైద్యుల సూచన మేరకు సన్‌ప్రొటెక్షన్ ఐ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు.


 నోట్: వలయాలను తగ్గించకుండా కనురెప్పలను ఎంత తీర్చిదిద్దినా అందంగా కనిపించవు.
 
 అలసట నుంచి విశ్రాంతి


 కంటి అందానికి సరైనవేళ నిద్ర తప్పనిసరి. యాంటీ ఏజింగ్‌కి బెస్ట్ సొల్యూషన్ నిద్ర. నిద్రించేటప్పుడు తల-మెడ సమాంతరంగా ఉండేలా దిండును అమర్చుకోవాలి. దీనివల్ల కంటిచుట్టూ రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది. చర్మం సాగినట్టు అవదు. చర్మం బిగుతు అవడానికి, తెల్లబడటానికి స్కిన్ టైట్‌నింగ్, వైట్‌నింగ్ క్రీమ్‌లను ముఖానికి వాడతారు. కాని కళ్ల కింద వాడలేరు. దీంతో కంటిచుట్టూ నల్లగా తయారవుతుంది. అందుకని రాత్రి, పగలు ఎలాంటి క్రీములు వాడినా ఫేసియల్ మాయిశ్చరైజర్‌ను కొద్దిగా చూపుడు వేలికి అద్దుకొని కంటి చుట్టూ మృదువుగా రాయాలి. దీంతో కంటి చుట్టూ ఉన్న చర్మం లోపల రక్తప్రసరణ జరిగి, పొడిబారడం, సాగడం తగ్గుతుంది. అందుకని రాత్రిపూట మేకప్, ఇతరత్రా ఫేసియల్ ఉత్పత్తులనుంచి తగినంత విశ్రాంతిని కంటికి ఇవ్వాలి.
 

నోట్: కళ్ల అలసట, జీవం లేకుండా ఉంటే ముఖం కూడా కాంతిహీనంగా కనిపిస్తుంది.
 
 సరైన సూచనలు


 కన్నులు పొడిగా, ఎరుపుగా తయారైతే కృత్రిమ టియర్స్ డ్రాప్స్ వాడాలి. దీంతో కళ్లు తాజాగా కనిపిస్తాయి. కంటికి భారంగా పరిణమించే పనులలో కాంటాక్స్ లెన్స్ వాడటం మర్చిపోవద్దు. అలాగే నిద్రించే సమయంలో వాటిని తీసేయడమూ మరవద్దు. కన్ను ఏ మాత్రం కాంతిని కోల్పోయినట్టు గమనించినా వైద్య సలహా తీసుకోవడం అస్సలు మరవద్దు.
 

నోట్: పొగ, సమతులాహార లోపం, జీవనశైలి కంటి అందాన్ని దెబ్బతీస్తాయి.
 
 ఐ లాష్ మార్కెట్


 కంటిచుట్టూ చర్మం బిగుతుగా మారడానికి బొటాక్స్ ఇంజక్షన్లు సాయపడతాయి. ఇందుకోసం డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ అవసరం లేకుండా ఇంటి చిట్కాలతోనే కంటి ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చు. మార్కెట్లో కృత్రిమ ఐ లాషెస్ దొరుకుతాయి. చిన్నగా ఉండే ఐ లాషెస్ కళ్లను మరీ చిన్నగా, మందంగా ఉండే కనురెప్పలు వయసు పైబడినట్టుగా మారుస్తాయి. పొడవైన కనురెప్పలు కంటి భాగాన్ని విశాలంగా మారుస్తాయి. వీటికి మస్కారా మరే ఇతర ఐ మేకప్ వాడినా వాటిని తొలగించి కావలసినంత విశ్రాంతినివ్వడం మంచిది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement