contact lens
-
కాంటాక్ట్ లెన్స్ వల్ల కళ్లకు ప్రమాదమా?
బాలీవుడ్ నటి జాస్మిన్ భాస్మిన్కి ఎదురైన చేదు అనుభవం కాంటాక్స్ లెన్స్ వాడే వాళ్లందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. బాబోయ్ కాంటాక్ట్ లెన్స్ ఇంత ప్రమాదమా అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ లెన్స్‌లు వాడచ్చా? దీని వల్ల కళ్లకు ప్రమాదమా? అంటే..ఇటీవల్ బాలీవుడ్ నటి జాస్మిన్ బాస్మిన్ ఒక ఈవెంట్‌కి హాజరవ్వయ్యేందుకు కాంటాక్ట్ లెన్స్ ధరించింది. దీంతో కళ్లు విపరీతమైన నొప్పి వచ్చి కనిపించకుండా పోయింది. తీరా వైద్యల వద్దకు వెళ్తే కార్నియా తీవ్రంగా డ్యామేజ్ అయ్యిందని చెప్పి కళ్లకు బ్యాండేజ్ వేశారు. దీంతో ఒక్కసారిగా అందరిలో లెన్స్ వాడొచ్చా?. దీని వల్ల కళ్లకు సమస్యలు వస్తాయా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే నిపుణులు ఏమంటున్నారంటే..ఎందువల్ల అంటే..కార్నియా అనేది గోపురం-ఆకారపు కణజాలం. ఇది కంటి బయట స్పష్టమైన పొరను ఏర్పరుస్తుంది. ఇది మన దృష్టిని కేంద్రీకరించేలా లెన్స్‌లా పనిచేసే కీలకమైన రక్షణ పొర. కళ్లలోకి కాంతి ప్రవేశించినప్పుడు ఇది వక్రీభవించేలా చేస్తుంది. రెటినాకు, కార్నియాకు ఏదైనా నష్టం ఏర్పడితే కణజాలం దెబ్బతినడం జరుగుతుంది. ఈ కార్నియల్ దెబ్బతినడానికి పలు రీజన్లు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ప్రమాదాలు, శస్త్ర చికిత్సలు, లేదా వస్తువుల కారణంగా ఎదురయ్యే ప్రమాదాల్లో ఈ కార్నియా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కార్నియ సమస్యలకు రీజన్..కాంటాక్ట్ లెన్స్‌లను సరిగా వాడకపోతే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. యూవీ కిరణాలకు గురికావడం, మధుమేహం లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధులు, పోషకాహార లోపం తదితరాలు కార్నియా డ్యామేజ్‌కి గల కారణాలని చెబుతున్నారు వైద్యలు. అలాగే ప్రమాదాల్లో కన్ను దెబ్బతిన్న తీవ్రతను బట్టి ఇది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఇలా కార్నియా దెబ్బతింటే మాత్రం ఒక్కోసారి చూపుకూడా కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. లెన్స్‌లు హాని చేస్తాయా..?లెన్స్‌లు సరిగా ఉపయోగించకపోతే కార్నియాకు ప్రమాదమనే చెబుతున్నారు వైద్యులు. అవి పరిశుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. లెన్స్‌లు తప్పుగా ఉపయోగించినట్లయితే కంటిపై ఒక విధమైన రాపిడి వచ్చి ప్రమాదం కలిగిస్తుంది. ఈ సమస్యలు చాలా అరదుగా జరిగేవే అయినా..సకాలంలో చికిత్స తీసుకోకపోతే కార్నియాపై మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాత్రిపూట లెన్స్‌లు ఉపయోగించటం వల్ల ఒక్కోసారి కార్నియా వాపుకి గురవ్వుతుంది.ఎదురయ్యే సమస్యలు..కంటి నొప్పి లేదా అసౌకర్యంకంటిలో ఎరుపు కాంతికి సున్నితత్వంఉత్సర్గకంటిలో ఏదో ఉన్నట్లుగా పీలింగ్చికిత్స: కార్నియల్ ఇన్ఫెక్షన్ను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దురద, తేలికపాటి సమస్యలకు ఐ డ్రాప్స్ ఇస్తారు. ఆ తర్వాత నుంచి కాంటాక్ట్ లెన్స్‌లు వాడకం తగ్గించడం లేదా ప్రత్యేక కాంటాక్ట్ లెన్సులు ధరించడం వంటివి చేయాలి. లెన్స్‌లు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..నిపుణులు సూచించిన విధంగా లెన్స్‌లు, లెన్స్ కేసులను మార్చండిలెన్స్లను ఎల్లప్పుడూ కాంటాక్ట్ లెన్స్ కేస్‌లో మాత్రమే ఉంచండిప్రతిసారీ తాజా ద్రావణాన్ని శుభ్రం చేయడానికి, అలాగే ఉపయోగించేందుకు రాత్రిపూట లెన్స్‌ను ద్రావణంలో ఉంచండిలెన్స్ డ్యామేజ్ కాకుండా ఉండేలా సురక్షిత క్లాత్‌ని ఉపయోగించండి.నేత్ర వైద్యునితో ఎప్పటికప్పుడూ పరీక్షలు చేయించుకోండిపడుకునే ముందు ఎల్లప్పుడూ లెన్స్‌లను తీసివేయండివేరే వాళ్లతో షేర్ చేసుకోవద్దు.(చదవండి: వర్షాకాలంలో ఆకుకూరలు తినవచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
బాప్రే!...ఆమె కంటిలో ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్‌లు...
ఇంతవరకు పలు రకాల వైరల్ వీడియోలు చూశాం. క్లినికల్ ఆపరేషన్‌కి సంబంధించిన వీడియోలు అరుదు. అందునా కంటికి సంబంధించిన సర్జరీ వీడియోలు చూసి ఉండం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే.. అమెరికాలో ఒక వృద్ధురాలికి కాంటాక్ట్ లెన్స్ ధరించే అలవాటు ఉంది. వాస్తవానికి ఇలాంటి కాంటాక్ట్‌లెన్స్ ధరిస్తే రాత్రి పడుకునే ముందు కచ్చితంగా తీసేసి పడుకోవాలి. ఐతే ఆమె అలా చేయడం మరిచిపోయి ప్రతి రోజు మరో కొత్త లెన్స్‌ని వాడటం మొదలు పెట్టింది. ఇలా సుమారు ఒక నెల వరకు ఇలానే చేసింది. ఆ తర్వాత కన్ను నుంచి నీరు రావడం, ఇబ్బందిగా ఉండటంతో ఆ వృద్ధురాలు డాక్టర్ వద్దకు వచ్చింది. దీంతో వైద్యులు ఆమె కంటికి ఒక చిన్న సర్జరీ చేసి సుమారు 23 కాంటాక్ట్ లెన్స్‌లను తొలగించారు. ఈ మేరకు డాక్టర్ కటెరినా కుర్తీవా మాట్లాడుతూ...ఇలా కాంటాక్ట్ లెన్స్‌లు తీయడం మరిచిపోయి మళ్లీ కొత్తది పెట్టడం అనేది చాలా అరుదైన ఘటన అని అన్నారు. కాంటాక్ట్ లెన్స్‌ని వేరుచేయడానికి చాలా సూక్ష్మమైన పరికరాన్ని వినియోగించాల్సి వచ్చిందన్నారు. ఆ కాంటక్ట్ లెన్స్‌లన్నీ కంటిలో ఒక నెల వరకు ఉండటంతో ఒకదానికొకటి అతుక్కుపోయి ఉన్నాయని చెప్పారు. ఇలా ఆమె వరుసగా 23 రోజులు చేసిందని అన్నారు. సర్జరీ తర్వా లెక్కిస్తే...కరెక్ట్‌గా 23 కాంటాక్ట్ లెన్స్‌లు ఉన్నాయని చెప్పారు. అంతేగాదు సదరు వైద్యురాలు ఆ సర్జరీకి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Ophthalmologist | Dr. Katerina Kurteeva M.D. | Newport Beach (@california_eye_associates) (చదవండి: బీటెక్ చదివితే జాబే చేయాలా.. ‘బీటెక్ చాయ్‌వాలి’ వెరీ స్పెషల్ అంటున్న నెటిజన్లు!) -
కంటి జబ్బులకు వినూత్న కాంటాక్ట్ లెన్స్!
కాలో చేయో విరిగితే అతికించవచ్చునేమోగానీ.. అలాంటి దెబ్బ కంటికి తగిలితే మాత్రం చాలా ఇబ్బంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ఒకరు వినూత్నమైన కాంటాక్ట్ లెన్స్ సిద్ధం చేశారు. మానవ ఉమ్మునీటితో తయారయైన ఈ కాంటాక్ట్ లెన్స్‌లలో లింబల్ మెసెన్కైమల్ స్టోమల్ కణాలతో నిండి ఉంటుంది. కనుగుడ్ల మార్పిడి శస్త్రచికిత్సల్లో వ్యర్థాలుగా ఉండే ఈ కణాలు కంటి గాయాలను మాన్పడంలో సాయపడతాయి. అలాగే ఉమ్మునీటితో తయారైన త్వచాలు మంట/వాపులు, గాయపు గుర్తులు మాన్పే లక్షణమున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. కనుగుడ్డుపై వచ్చే అల్సర్లు, సంప్రదాయ చికిత్స పద్ధతులకు లొంగని కొన్ని సమస్యలకు ఈ కొత్త పద్ధతి ద్వారా ఉపశమనం లభిస్తుందని అంచనా. ఇళ్లల్లో, ఫ్యాక్టరీల్లో ప్రమాదకరమైన రసాయనాలు సోకినప్పుడు ఏర్పడే గాయాలకూ ఈ వినూత్న కాంటాక్ట్ లెన్స్‌ను మెరుగైన చికిత్స కాగలవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేమియన్ హార్కిన్ అంటున్నారు. అయితే ఉమ్మునీటి త్వచాలు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండటం ఒక్కటే కొంచెం సమస్యగా ఉందని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఐదేళ్లలో ఈ కొత్త రకం కాంటాక్ట్ లెన్స్‌లు అందరికీ అందుబాటులోకి రావచ్చునని హార్కిన్ అంటున్నారు. -
28 ఏళ్ల క్రితం పోయింది.. ఇప్పుడు కంట్లో దొరికింది
లండన్ : కంట్లో ఏదో ఇబ్బందిగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు విస్తుపోయే వార్త చెప్పారు డాక్టర్లు. వైద్యులు చెప్పిన విషయం ఆమెనే కాకా నెటిజన్లను కూడా వామ్మో అనేలా చేసింది. విషమేంటంటే.. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ(42) కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతోంది. దాంతో వైద్యులను సంప్రదించింది. ఎమ్ఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులకు ఆమె కంటిలో ఒక లెన్స్ ఉన్నట్లు తెలిసింది. అందువల్లే ఆమెకు ఇబ్బంది తలెత్తిందని, ఆపరేషన్ చేసి లెన్స్‌ను తొలగించాలని చెప్పారు డాక్టర్లు. సర్జరీ అనంతరం బయటకు తీసిన లెన్స్ వయసు నిర్థారించిన వైద్యులు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ లెన్స్ వయసు 28 ఏళ్లు. అంటే దాదాపు 30 ఏళ్లపాటు ఆ మహిళ లెన్స్‌ను తన కళ్లలో మోస్తూ తిరింగిందన్నమాట. వైద్యులు ఇదే విషయాన్ని సదరు మహిళకు చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది. తర్వాత తన టీనేజ్‌లో జరిగిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకుంది. ఈ విషయం గురించి మహిళ ‘నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కాంటక్ట్ లెన్స్ వాడుతున్నాను. అప్పుడు నాకు 14 ఏళ్లు ఉంటాయేమో... ఒక రోజు బ్యాడ్మింటన్ ఆడుతుండగా షటిల్‌కాక్ నా కళ్లకు తగిలింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే కాంటక్ట్ లెన్స్ లేదు. షటిల్‌కాక్ తగిలినప్పుడే అది ఎక్కడే పడిపోయిందనుకున్నాను. కానీ అది నా కంటి లోపలికి వెళ్లి పోయి ఇన్నాళ్ల పాటు అలానే ఉంది’ అంటూ తెలిపింది. అంతేకాక ఇన్నేళ్లలో తనకు ఎటువంటి కంటి సమస్యలు తలెత్తలేదని తెలిపింది. అయితే ఇన్నాళ్ల నుంచి కంటి లోపల ఉన్న లెన్స్ ఇప్పుడిలా బయట పడటానికి గల కారణాలు ఇంకా తెలియలేదన్నారు డాక్టర్లు. సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న ఈ లెన్స్ కథ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. -
మొబైల్‌ను శాసించే లెన్స్!
సియోల్: కంటిచూపుతో స్మార్ట్‌ఫోన్‌ను శాసించే అధునాతన టెక్నాలజీని ఆవిష్కరించేందుకు శామ్సంగ్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక కాంటాక్ట్ లెన్స్‌ను రూపొందించింది. ఇందులో బ్లూటూత్, కెమెరా, యాంటెన్నా, సెన్సర్స్, ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటాయి. వైఫైతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. బ్లూటూత్ ద్వారా కాల్ మాట్లాడవచ్చు. కంటిపాప కదలికల్ని బట్టి ఫొటోలు తీస్తుందని, లెన్స్ మధ్య ఉన్న డిస్ప్లేలో నిక్షిప్తమవుతుందని కంపెనీ తెలిపింది. వీటిని స్మార్ట్‌ఫోన్‌పై చూసుకోవచ్చంది. -
కాంటాక్ట్ లెన్స్‌లు వాడేవారూ... కాస్త జాగ్రత్త!
కొత్త పరిశోధన స్వాభావికంగా కంటిలో ఉండే బ్యాక్టీరియాతో పోలిస్తే... కాంటాక్ట్‌లెన్స్‌లు వాడేవారి కళ్లలో ఉండే బ్యాక్టీరియా కాస్త మారిపోయి వేరుగా ఉంటుందట. అందుకే మిగతావారితో పోలిస్తే కాంటాక్ట్‌లెన్స్‌లు వాడేవారిలో కంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువని అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ నిర్వహించిన వార్షిక సదస్సులో పరిశోధకులు వెల్లడించారు. వీరు తమ పరిశోధనల్లో కాంటాక్ట్లెన్స్లను ధరించేవారినీ, వాటిని ధరించని వారితో పోల్చిచూస్తూ తమ అధ్యయనాలను కొనసాగించారు. సాధారణంగా కంటిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే బ్యాక్టీరియా ఉంటుంది. కానీ కొంతకాలంపాటు కాంటాక్ట్‌లెన్స్‌లు ధరించేవారిలో ఆ బ్యాక్టీరియా మారిపోయి, కనురెప్పల వద్ద ఉండే బ్యాక్టీరియాతో పోలినదానిలా మారుతుందట. కాంటాక్ట్లెన్స్లను ధరించని వారి కంటిలో ఉండే బ్యాక్టీరియాతో పోల్చినప్పుడు అది కాస్త భిన్నంగానూ ఉంటోందట. అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలను పెంచడం మినహా, కళ్లకు జరిగే హాని కాంటాక్ట్‌లెన్స్ వంటి ఫారిన్‌బాడీ వల్ల జరుగుతోందా లేక అది అమర్చుకుంటున్నప్పుడు మన వేళ్ల ఒత్తిడి వల్ల జరుగుతందా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదంటున్నారు వారు. అయితే కాంటాక్ట్ లెన్స్‌లు ధరించేవారు తమ చేతులు, కనురెప్పల శుభ్రత విషయంలో మరింత జాగ్రత్త ఉండాలని మాత్రం సూచనలు చేస్తున్నారు ఈ పరిశోధకులు. -
కంటిచుట్టూ వలయాలా?
విశాలమైన నేత్రాలు, మిలమిలలాడుతూ ఉంటే ముఖారవిందం ముచ్చటగొలుపుతుంది. మేని సౌందర్యం కంటి భాష ద్వారే ఎదుటివారికి తెలుస్తుంది. కనులు అలసటగా, చుట్టూ నల్లని వలయాలుగా ఉంటే వయసు పైబడినట్టుగా కనిపిస్తుంది. అందుకే మేకప్కన్నా ముందుగా కళ్లను కాంతివంతంగా మార్చుకోవడం ఎలాగో తెలిసుండాలి. కంటి చుట్టూ చర్మం నల్లటి వలయాలు తగ్గడం కోసం ప్రతిరోజూ కంటి చుట్టూ యాంటీ ఏజింగ్ క్రీమ్, సీరమ్, ఫౌండేషన్ల వాడకం తప్పనిసరి కాదు. బయటకు వెళ్లేముందు యువి-ప్రొటెక్టివ్ సన్‌గ్లాసెస్ తప్పక వాడాలి. ఇది వైద్యుల సూచన కూడా! ఎలాంటి సంరక్షణ లేకుండా ఎక్కువసేపు ఎండ, గాలికి వున్నా కంటి చుట్టూ చర్మ కణాలు దెబ్బతింటాయి. ఎండలోకి వెళితే సన్‌స్క్రీన్ రాసుకోవాలి కదా అని కళ్ల చుట్టూ రాయకూడదు. ఇందుకోసం మినరల్ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి లేదా వైద్యుల సూచన మేరకు సన్‌ప్రొటెక్షన్ ఐ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. నోట్: వలయాలను తగ్గించకుండా కనురెప్పలను ఎంత తీర్చిదిద్దినా అందంగా కనిపించవు. అలసట నుంచి విశ్రాంతి కంటి అందానికి సరైనవేళ నిద్ర తప్పనిసరి. యాంటీ ఏజింగ్‌కి బెస్ట్ సొల్యూషన్ నిద్ర. నిద్రించేటప్పుడు తల-మెడ సమాంతరంగా ఉండేలా దిండును అమర్చుకోవాలి. దీనివల్ల కంటిచుట్టూ రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది. చర్మం సాగినట్టు అవదు. చర్మం బిగుతు అవడానికి, తెల్లబడటానికి స్కిన్ టైట్నింగ్, వైట్నింగ్ క్రీమ్‌లను ముఖానికి వాడతారు. కాని కళ్ల కింద వాడలేరు. దీంతో కంటిచుట్టూ నల్లగా తయారవుతుంది. అందుకని రాత్రి, పగలు ఎలాంటి క్రీములు వాడినా ఫేసియల్ మాయిశ్చరైజర్‌ను కొద్దిగా చూపుడు వేలికి అద్దుకొని కంటి చుట్టూ మృదువుగా రాయాలి. దీంతో కంటి చుట్టూ ఉన్న చర్మం లోపల రక్తప్రసరణ జరిగి, పొడిబారడం, సాగడం తగ్గుతుంది. అందుకని రాత్రిపూట మేకప్, ఇతరత్రా ఫేసియల్ ఉత్పత్తులనుంచి తగినంత విశ్రాంతిని కంటికి ఇవ్వాలి. నోట్: కళ్ల అలసట, జీవం లేకుండా ఉంటే ముఖం కూడా కాంతిహీనంగా కనిపిస్తుంది. సరైన సూచనలు కన్నులు పొడిగా, ఎరుపుగా తయారైతే కృత్రిమ టియర్స్ డ్రాప్స్ వాడాలి. దీంతో కళ్లు తాజాగా కనిపిస్తాయి. కంటికి భారంగా పరిణమించే పనులలో కాంటాక్స్ లెన్స్ వాడటం మర్చిపోవద్దు. అలాగే నిద్రించే సమయంలో వాటిని తీసేయడమూ మరవద్దు. కన్ను ఏ మాత్రం కాంతిని కోల్పోయినట్టు గమనించినా వైద్య సలహా తీసుకోవడం అస్సలు మరవద్దు. నోట్: పొగ, సమతులాహార లోపం, జీవనశైలి కంటి అందాన్ని దెబ్బతీస్తాయి. ఐ లాష్ మార్కెట్ కంటిచుట్టూ చర్మం బిగుతుగా మారడానికి బొటాక్స్ ఇంజక్షన్లు సాయపడతాయి. ఇందుకోసం డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ అవసరం లేకుండా ఇంటి చిట్కాలతోనే కంటి ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చు. మార్కెట్లో కృత్రిమ ఐ లాషెస్ దొరుకుతాయి. చిన్నగా ఉండే ఐ లాషెస్ కళ్లను మరీ చిన్నగా, మందంగా ఉండే కనురెప్పలు వయసు పైబడినట్టుగా మారుస్తాయి. పొడవైన కనురెప్పలు కంటి భాగాన్ని విశాలంగా మారుస్తాయి. వీటికి మస్కారా మరే ఇతర ఐ మేకప్ వాడినా వాటిని తొలగించి కావలసినంత విశ్రాంతినివ్వడం మంచిది.