కంటి జబ్బులకు వినూత్న కాంటాక్ట్‌ లెన్స్‌! | Innovative contact lens for eye diseases | Sakshi
Sakshi News home page

కంటి జబ్బులకు వినూత్న కాంటాక్ట్‌ లెన్స్‌!

Published Fri, Nov 9 2018 1:05 AM | Last Updated on Fri, Nov 9 2018 1:05 AM

Innovative contact lens for eye diseases - Sakshi

కాలో చేయో విరిగితే అతికించవచ్చునేమోగానీ.. అలాంటి దెబ్బ కంటికి తగిలితే మాత్రం చాలా ఇబ్బంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ఒకరు వినూత్నమైన కాంటాక్ట్‌ లెన్స్‌ సిద్ధం చేశారు. మానవ ఉమ్మునీటితో తయారయైన ఈ కాంటాక్ట్‌ లెన్స్‌లలో లింబల్‌ మెసెన్‌కైమల్‌ స్టోమల్‌ కణాలతో నిండి ఉంటుంది. కనుగుడ్ల మార్పిడి శస్త్రచికిత్సల్లో వ్యర్థాలుగా ఉండే ఈ కణాలు కంటి గాయాలను మాన్పడంలో సాయపడతాయి. అలాగే ఉమ్మునీటితో తయారైన త్వచాలు మంట/వాపులు, గాయపు గుర్తులు మాన్పే లక్షణమున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది.

కనుగుడ్డుపై వచ్చే అల్సర్లు, సంప్రదాయ చికిత్స పద్ధతులకు లొంగని కొన్ని సమస్యలకు ఈ కొత్త పద్ధతి ద్వారా ఉపశమనం లభిస్తుందని అంచనా. ఇళ్లల్లో, ఫ్యాక్టరీల్లో ప్రమాదకరమైన రసాయనాలు సోకినప్పుడు ఏర్పడే గాయాలకూ ఈ వినూత్న కాంటాక్ట్‌ లెన్స్‌ను మెరుగైన చికిత్స కాగలవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేమియన్‌ హార్కిన్‌ అంటున్నారు. అయితే ఉమ్మునీటి త్వచాలు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండటం ఒక్కటే కొంచెం సమస్యగా ఉందని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఐదేళ్లలో ఈ కొత్త రకం కాంటాక్ట్‌ లెన్స్‌లు అందరికీ అందుబాటులోకి రావచ్చునని హార్కిన్‌ అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement