
మొబైల్‌ను శాసించే లెన్స్!
సియోల్: కంటిచూపుతో స్మార్ట్‌ఫోన్‌ను శాసించే అధునాతన టెక్నాలజీని ఆవిష్కరించేందుకు శామ్‌సంగ్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక కాంటాక్ట్ లెన్స్‌ను రూపొందించింది. ఇందులో బ్లూటూత్, కెమెరా, యాంటెన్నా, సెన్సర్స్, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటాయి. వైఫైతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. బ్లూటూత్ ద్వారా కాల్ మాట్లాడవచ్చు. కంటిపాప కదలికల్ని బట్టి ఫొటోలు తీస్తుందని, లెన్స్ మధ్య ఉన్న డిస్‌ప్లేలో నిక్షిప్తమవుతుందని కంపెనీ తెలిపింది. వీటిని స్మార్ట్‌ఫోన్‌పై చూసుకోవచ్చంది.