
క్యాన్సర్ చికిత్స కోసం గత ఏడాది సెప్టెంబరులో న్యూయార్క్ వెళ్లిన బాలీవుడ్ పూర్వపు తరాల ఆరాధ్య కథానాయకుడు రిషి కపూర్ ఈ వినాయక చవితికి (సెప్టెంబరు 2) ముంబైలో ఉండేలా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘చికిత్స జరుగుతున్నంత కాలం నా భార్య నీతూ నాకు పెద్ద ఆలంబనగా నిలిచారు. కుటుంబ బాధ్యతలన్నీ మీద వేసుకుని అందరికీ అండగా నిలబడ్డారు. ఇండియా వెళ్లాక నాకెంతో ఇష్టమైన చేపల వేపుడు, మృదువైన చపాతీలను నీతూ చేత చేయించుకుని తింటాను. గణేశ్ పూజ కోసం, నా అభిమానులను చూడ్డం కోసం నా మనసు త్వరపడుతోంది’’ అని రిషి కపూర్ అమెరికాలోని ఇండియన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment