
షెర్లాక్ హోమ్స్ పాత్ర సృష్టికర్తా, కొన్ని వందల డిటెక్టివ్ కథలు రాసిన ప్రసిద్ధ రచయిత సర్ ఆర్థర్ కానన్ డాయిల్‌కు పునర్జన్మల మీదా, చనిపోయిన వారి ఆత్మలు తిరుగుతుంటాయనీ, వాటితో మాట్లాడవచ్చుననీ నమ్మకం ఉండేదట. ఓసారి డాయిల్‌కు బాగా తెలిసిన స్నేహితుడొకాయన చనిపోతే చూడ్డానికి వెళ్లాడు. అక్కడికి వచ్చిన వారిలో ఒకాయన డాయిల్‌తో, ‘‘ఏమండీ, మీరు చనిపోయినవారి ఆత్మలతో మాట్లాడవచ్చునని అంటారు కదా. మరి మీ స్నేహితుని ఆత్మతో మాట్లాడుతారా?’’ అని అడిగాడు. లేదన్నాడు డాయిల్. ‘‘ఎందుకని?’’ ప్రశ్నించాడా వ్యక్తి. ‘‘మా ఇద్దరికీ మాటల్లేవు’’ అని జవాబిచ్చాడు డాయిల్.
- ఈదుపల్లి వెంకటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment