శారీ నుంచి పలాజో...
న్యూలుక్
మోడ్రన్ టాప్స్, సంప్రదాయ కుర్తీలకు బాటమ్‌గా పలాజో ప్యాంట్స్ ఇప్పుడు ముందు వరసలో ఉన్నాయి. సౌకర్యం, స్టైల్ వల్ల నేటి మహిళ పలాజోను బాగా ఇష్టపడుతుంది. పలాజోలను ప్లెయిన్‌గా, సాదాగా ఇష్టపడని వారు తమదైన సృజనతో ఇలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.తమ దగ్గర ఉపయోగించని సిల్క్ లేదా కాటన్ చీరలను కుర్తీలకు మాత్రమే కాదు ఇలా పలాజో ప్యాంట్స్‌కూ వాడచ్చు.
పెద్ద అంచు చీరలు పెద్దలు మాత్రమే కట్టుకుంటే బాగుంటుందని అనుకుని వాటిని పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వాటిని కూడా పలాజో స్కర్ట్స్‌లా డిజైన్ చేసి వాటికి అందమైన డోరీస్‌ను వేలాడదీసి ధరించవచ్చు. ప్లెయిన్ పలాజో ఉంటే దానికి చీర అంచును జత చేసి కలర్‌ఫుల్ పలాజోను డిజైన్ చేసుకోవచ్చు.టై అండ్ డై చేసిన ఫ్యాబ్రిక్, ఇకత్, పోచంపల్లి వంటి చేనేత చీరలను పలాజో ప్యాంట్‌గానూ, స్కర్ట్‌గానూ డిజైన్ చేయించుకోవచ్చు. వాటి మీదకు అనార్కలీ టాప్స్, కుర్తీలు, టీ షర్ట్స్ ధరించవచ్చు.