దంపతుల మధ్య షేరింగ్ ఉందా?
సెల్ఫ్ చెక్
పండ్లు... ఆటవస్తువు... పుస్తకాలు... బట్టలు... వీటిని చిన్నప్పుడు ఒకే ఇంట్లో ఉన్న పిల్లలు పంచుకోవటం సహజం. తల్లిదండ్రుల ప్రేమను కూడా పిల్లలు పంచుకోవాల్సిందే! కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత పిల్లలు పెద్దవారవటం పెళ్లి చేసుకుని భార్య/భర్తగా మారటం సహజం. ఇప్పుడు లైఫ్‌పార్ట్‌నర్‌తో ప్రతి ఒక్కటీ షేర్ చేసుకోవలసి ఉంటుంది. ‘‘మా ఆయన బంగారం, మా శ్రీమతి పంచదార’’ ఇలాంటి డైలాగులను అనిపించుకోవాలంటే మీ భార్య/భర్తతో అన్ని విషయాల్లో ఇచ్చిపుచ్చుకోవటాలు సమానంగా ఉండాలి. మీ దంపతులు మ్యారీడ్ లైఫ్‌ని ఎలా షేర్ చేసుకుంటున్నారు? ఇచ్చిపుచ్చుకోవటంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉంటున్నారా? ఇది తెలుసుకోవటానికి ఒకసారి సెల్ఫ్‌చెక్ చేసుకోండి.
1. మీ దంపతులు మీ అనుభవాలన్నింటినీ ఒకరితో ఒకరు పంచుకుంటారు. చాలా పర్సనల్ విషయాలు కూడా మినహాయింపు కాదు.
ఎ. అవును బి. కాదు
2. ఇప్పుడు పూర్తి చేస్తోన్న క్విజని కూడ ఇద్దరూ కలసి పూర్తి చేస్తారు. ‘ఎ’, ‘బి’ లు టిక్ చేసేటప్పుడు నిజాయితీగా ఉంటారు.
ఎ. అవును బి. కాదు
3. పిల్లల్ని పెంచటంలో మీ బాధ్యతల నిర్వహణలో తేడాలు రానివ్వరు.
ఎ. అవును బి. కాదు
4. బ్యాంకులో మీ దంపతులకు జాయింట్ ఎకౌంటులు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీల్లో మీ మధ్య విభేదాలు రావు.
ఎ. అవును బి. కాదు
5. ఆదాయం, ఖర్చులు, సేవింగ్స్ విషయంలో ఇద్దరూ సంప్రదించుకుని బాధ్యతలు పంచుకుంటారు.
ఎ. అవును బి. కాదు
6. పిల్లలపై ఇద్దరూ ఒకేరకమైన ప్రేమను చూపుతారు.
ఎ. అవును బి. కాదు
7. ఇంటిపనులు మీరు చేయాలంటే, మీరు చేయాలని పంతాలకు పోరు. సమయాన్ని అనుసరించి ఇద్దరూ పంచుకుంటారు.
ఎ. అవును బి. కాదు
8. ఖాళీ సమయాన్ని ఎవరికి వారుగా గడపకుండా ఇద్దరు కలసి ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
9. మీ అభిరుచులు, వైఖరులు దాదాపుగా ఒకేవిధంగా ఉంటాయని చెప్పగలరు. లేకున్నా ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు పంచుకుంటారు.
ఎ. అవును బి. కాదు
10. మీ భార్య/భర్తను కోపగించుక్ను సందర్భాలు చాలా తక్కువ.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ సమాధానాలు ఏడు వస్తే మీ దంపతులు అన్ని విషయాల్లో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిని కలిగి ఉంటారు. భార్య/భర్త నుంచి ఎంత ఆశిస్తారో అంత ఇవ్వటానికి వెనకాడరు. మీలా మీ లైఫ్‌పార్ట్‌నర్ కూడా ఉంటే మీ సంసారం ఆనంద సాగరమే. లైఫ్‌పార్ట్‌నర్ నుంచి సహకారం లేకపోతే, వారిని ప్రేమతో జయించటం మీ చేతుల్లోనే ఉంటుంది. ‘బి’లు ఎక్కువ వస్తే జీవితభాగస్వామితో అరమరికలు లేకుండా ఉండడం మీకు చేతకావట్లేదనే అర్థం. కష్టసుఖాలను పంచుకుంటే ఎంత సంతోషం కలుగుతుందో తెలుసుకోండి. ఇప్పుడు మీరున్న దానికి భిన్నంగా ప్రయత్నించి చూస్తే తేడా మీకే తెలుస్తుంది.