క్యాబేజీ ఒక ఆరోగ్యకరమైన ఆకుకూరగా మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్సగా కూడా పనికి వస్తుంది. క్యాబేజీని ఆహారంలో తరచూ తీసుకునే వారిలో ఎన్నో రకాల జబ్బులు దూరం అవుతాయి. అంతేకాదు, ఎన్నో వ్యాధులను అవి రాకుండా కూడా క్యాబేజీ నివారిస్తుంది! క్యాబేజీతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని ఇవి.
♦ విటమిన్–సి ఎన్నో వ్యాధులను నివారిస్తుందన్నది తెలిసిందే. నమ్మడం ఒకింత కష్టంగానీ నిజానికి ఆరెంజ్‌లో కంటే క్యాబేజీలోనే విటమిన్–సి పాళ్లు ఎక్కువ. అది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా. అందుకే క్యాబేజీ ఎన్నో క్యాన్సర్లను నివారించడంతో పాటు, వయసు పెరుగుదలతో వచ్చే మార్పులను ఆలస్యం చేసి, దీర్ఘకాలం యౌవనంగా ఉండటానికి తోడ్పడుతుంది.
♦ క్రమం తప్పకుండా క్యాబేజీని ఆహారంలో తీసుకునేవారిలో అలర్జీలు, నొప్పి–మంట–వాపు (ఇన్‌ఫ్లమేషను) చాలా తక్కువ. క్యాబేజీలోని గ్లుటామైన్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ ఇందుకు కారణం. గాయాలు త్వరగా తగ్గేందుకూ క్యాబేజీ దోహదపడుతుంది.
♦ క్యాబేజీలోని బీటా–కెరటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు... ఈ బీటా–కెరటిన్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా నివారితమవుతుంది.
♦ క్యాబేజీ వల్ల వెలువడే క్యాలరీలు చాలా తక్కువ. అందుకే స్థూలకాయులకు, బరువు పెరుగుతున్న వారికి ఇది మంచి ఆహారం.
♦ మెదడు ఆరోగ్యానికి, నరాల మీద ఉండే మైలీన్ షీత్ అనే పొర దెబ్బతినకుండా కాపాడటానికి క్యాబేజీ ఎంతగానో దోహదపడుతుంది. అలై్జమర్స్, డిమెన్షియా వ్యాధులను నివారిస్తుంది.
♦ క్యాబేజీలో... మిగతా పోషకాలతో పాటు క్యాల్షియమ్ కూడా ఎక్కువే. అందుకే ఇది ఎముక ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఎముకలు బలహీనంగా మారే ఆస్టియోపోరోసిస్ వంటి కండిషన్‌లను నివారిస్తుంది.
♦ క్యాబేజీ అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు... ఇది ఒంట్లోని విషాలను హరించే మంచి డీ–టాక్సిఫైయింగ్ ఏజెంట్.
Comments
Please login to add a commentAdd a comment