ఎక్కడని నన్ను వెతుకుతావు
భగ భగ మండుతున్న
పద్య పాదాలమీంచి నడిచి రా
ఝుం ఝుం మని వీచే గాలుల్లోకి రా
అడవుల్లో వాగుల్లో
కొండల్లో కోనల్లో
సమూహంగా పరిగెత్తే
మహిషాల గుంపుల్లోకి రా
వేటగాళ్ళని వెంటాడి వెంటాడి వేటాడే
క్రోధారుణిమ మొహాల్లోకి రా
చింతనిప్పుల కళ్ళతో
వర్తులంగా ఆకాశంలోంచి
గిరికీలు కొట్టే
గెద్ద చూపుల్లోకి రా
నాగరిక సమాజం
తరిమేసిన శిశువుల్లో
అడవి పెంచి పెద్ద చేసిన
డాన్ బాస్కోల్లోకి రా
వాడి నిశ్శేషం కోసం
బోధి వృక్షం క్రింద
సాము చేస్తున్న
వారి ముందు నిల్చో
- విజయచంద్ర
9438720409