
ఒకడే వీరుడు
కందుకూరి వీరేశలింగం
‘‘మనవాళ్లు పూర్వాచార పరాయణులగుట చేత నీతిబాహ్యమైన గూఢ వ్యభిచారమునైన నంగీకరింతురుగాని, యాచార విరుద్ధమైన ధర్మవివాహము నంగీకరింపరు’ అని కందుకూరి వీరేశలింగం ఏమాత్రం మొహమాటం లేకుండా సభల్లో ఉపన్యసించడం పెద్దపెద్దవాళ్లకు ఆగ్రహంతెప్పించింది. వీరేశలింగంపై విరుచుకుపడ్డారు. ఆయనపై ఖండన గ్రంథాలు రాశారు. ఉత్తరాలు రాశారు. వాటిలో ఏ ఉత్తరానికీ ఆయన విలువ ఇవ్వలేదు. ఒక ఉత్తరానికితప్ప. అది.. క?ష్ణమండలంలోనితిరువూరు డిప్యూటీతాసిల్దారు బ్రహ్మశ్రీ దర్భా బ్రహ్మానందం గారి నుంచి వచ్చిన ఉత్తరం.
తిరువూరుతాలూకా రేపూడి గ్రామంలో గౌరమ్మ అనే పన్నెండేళ్ల బాల వితంతువు ఉన్నదనీ, ఆమెకు మళ్లీ పెళ్లి చేసేందుకు ఆమెతల్లి సీతమ్మ సిద్ధంగా ఉన్నారని అందులోని సారాంశం.‘మీదే ఆలస్యం’ అని పంతులుగారుత?ణం రిప్లయఖు ఇచ్చారు. అమ్మాయిని భద్రంగా రాజమహేంద్రవరంతెప్పించితన ఇంట్లో,తన భార్య సంర?ణలో ఉంచుకున్నారు. ఆ వెంటనే వరుడి వేట మొదలైంది!
విశాఖపట్నం పో?స హెడ్ క్వార్టర్ట్స్‌లో పనిచేస్తున్న గోగులపాటి శ్రీరాములు అనే యువకుడు ఆ ణంలో పంతులుగారి మదిలో మెదిలారు. గతంలో అతడు పంతులుగారి ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అతడికి కబురు పంపారు. శ్రీరాములు గౌరమ్మను చూడకుండానే పెళ్లికి ఒప్చకున్నాడు. అది అతడికి పంతులుగారిపై ఉన్న గౌరవం.
శ్రీరాములుకు అంతకుముందే ఒక పెళ్లయింది. భార్య అకస్మాత్తుగా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఆ ఒంటరితనాన్ని పోగొట్టేందుకు పిల్లనిస్తామని ఎంతోమంది వచ్చినా వితంతు వివాహం చేసుకోడానికి అతడు వేచి ఉన్నాడు. చివరికి గౌరమ్మ దొరికింది!
పెళ్లి పనులు రహస్యంగా జరుగుతున్నాయి. వరుడి పేరును కూడా పంతులుగారు రహస్యంగా ఉంచారు. గౌరమ్మ అనే బాల వితంతువుకు పంతులుగారింట్లో పెళ్లి జరగబోతోందని ఊరంతటికీతెలిసింది కానీ వరుడెవరో బయటికి పొక్కలేదు. పెళ్లికి కావలసిన రణ పంతులుగారికి ఇనఖస్పెక్టర్ జనరలఖ ?ఫ పో?స కర్నలఖ పోరి?స దొరగారి నుంచి లభించింది. పెళ్లికి అవసరమైన డబ్బును పంతులుగారి స్నేహితుడు పైడా రామక?ష్ణయ్యగారు పంపించారు. వధూవరులకు కావలసిన నైతిక స్థయిర్యాన్ని పంతులుగారు ఇచ్చారు. అలా రాజమహేంద్రవరంలో 1881 డిసెంబర్ 11న మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిగింది.
చివరి నిమిషంలో వరుడితల్లిదండ్రులకు విషయంతెలిసి గగ్గోలు పెడుతూ కల్యాణ మంటపానికి చేరుకున్నారు. వేయడానికి ?ింతలు, ఇవ్వడానికి అశీర్వచనాలుతప్ప వాళ్లకేం మిగల్లేదు.‘‘ఈ బక్క పీనుగకు చావైనా రాదే! వీడి మీది గౌరవంతో వీడి పెళ్లానికి ఇంకో పెళ్లి చేద్దుము’’ అని శుద్ధ సంప్రదాయవాదులు పంతులుగారిని రహస్యంగాతిట్టుకున్నారు. ఆ రహస్యం ఆయన చెవిన పడి నవ్వుకున్నారే గానీ, నమ్మినతోవను వదిలి వెళ్లలేదు.
వీరేశలింగం పంతులుగారు శారీరకంగా బలహీనులైతే కావచ్చు. మానసికంగా బలవంతులు. పైడా రామక?ష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మి్రుశ్ర్త్వపులు, విద్యార్థుల బలం ఆయనకుతోడయ్యింది. అన్నిటికన్నా పెద్ద బలం ఆయన అర్ధాంగి రాజ్యలక్ష్మిగారు. వీళ్లందరి సహకారంతో పంతులుగారుతను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు.తను బతికుండగా నలభై వరకూ వితంతు వివాహాలు జరిపించారు. ఇలాంటి దుస్సాహసాలే ఆయన్ని నేడు సంఘసంస్కర్తగా నిలబెట్టాయి.
(వీరేశలింగంగారుతొలి వితంతు పునర్వివాహం జరిపించి నిన్నటికి 133 ఏళ్లు అయిన సందర్భంగా)