మెడిక్ష నరీ
పండంటి బిడ్డ పుట్టాలని అందరూ కోరుకుంటారు. బొద్దుగా బరువు ఎక్కువగా ఉండాలనీ అనుకుంటారు. కానీ గర్భిణుల్లో వచ్చే చక్కెరవ్యాధి (జెస్టెషనల్ డయాబెటిస్) ఉన్నవారిలో పుట్టే బిడ్డలు బరువు ఎక్కువగా ఉంటే అది బిడ్డలకు ముప్పే. ఇలా పిల్లలు మరీ బొద్దుగా, బరువు ఎక్కువగా ఉండటాన్ని వైద్యపరిభాషలో ‘మాక్రోసోమియా’ అంటారు. దీనికి కారణం... పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లిలోని చక్కెర వారి శరీరంలోకీ ప్రవేశిస్తుంది. దాన్ని నియంత్రించడానికి చిన్నారిలోనూ ఇన్సులిన్ ఎక్కువగా స్రవిస్తుంది. దీని మరో పరిణామం ఏమిటంటే... గర్భంలోని బిడ్డ తల్లి నుంచి చాలా ఎక్కువ పోషకాలను స్వీకరిస్తుంది. ఫలితంగా గర్భసంచిలో బిడ్డ బరువు చాలా ఎక్కువ అవుతుంది.
ఇలా బిడ్డ ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటాన్ని ‘మాక్రోసోమియా’ అంటారు. ఇది పుట్టబోయే బిడ్డకూ, జన్మనిస్తున్న తల్లికీ... ఇద్దరికీ ప్రమాదం కావచ్చు. అందుకే అబ్‌స్ట్రెట్రీషియన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రక్రియ ద్వారా బిడ్డ మరీ బొద్దుగా ఉన్న కండిషన్ అంచనా వేస్తారు. ఒక్కోసారి సాధారణ ప్రసవం అవుతుందని అనుకున్నా, తల తల మాత్రమే బయటకు వచ్చి (శీర్షోదయమై) భుజాలు ప్రసవమార్గంలో ఇరుక్కుపోవచ్చు. దీన్నే ‘షోల్డర్ డిస్టోసియా’ అంటారు. అదొక మెడికల్ ఎమర్జెన్సీ. అందుకే బిడ్డ మరీ బొద్దుగా ఉన్నా అది ప్రమాదమే.
శిశువులు మరీ బొద్దుగా ఉంటే...?
Published Fri, Dec 11 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM
Advertisement
Advertisement