100% లవ్! | 100% Love! | Sakshi
Sakshi News home page

100% లవ్!

Published Sat, Feb 14 2015 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

100% లవ్!

100% లవ్!

సృష్టిలో మధురం... అమరం ప్రేమ. ఈ ప్రేమ తోటలో మనసుల ఊసులు... వలపుల పంటలు. జంట హృదయాలను ఉప్పొంగించి... ఉత్తేజాన్ని నింపుతుంది ప్రేమ. అందులో ఓ మైకం, మెస్మరిజం. అప్పుడప్పుడూ విరహం, విషాదం. అందరినీ తరచి, ఆనందం పంచి, ఆపై నువ్వు లేనిదే నేను లేననేసి మురిపిస్తుందీ ప్రేమ. రోమియో- జ్యూలియట్‌ల కథ విన్నా... సలీం- అనార్కలీల వ్యథ తెలుసుకున్నా... అమితాబ్- రేఖల విరహం చూసినా... కనిపించేది ప్రేమే! వాలెంటైన్స్ డే... ట్రిమ్‌గా రెడీ అయ్యి... చేతిలో రోజా పట్టుకుని... ప్రపోజ్ చేయడానికి వెళ్లేముందు... ఓసారి ‘లవ్ రివైండ్’ వేసుకుంటున్నాడు విరాట్! లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లా గాళ్‌ఫ్రెండ్‌కు చేసే తొలి ప్రపోజ్ గన్‌షాట్‌లా పేలాలనేది ప్లాను! అందుకే కేర్‌ఫుల్‌గా ప్రేమ చరిత్రను తిరగేస్తున్నాడు. ఇంతకీ ఏం చెప్పాలి! ఎలా చెప్పాలి! ఊ..ఫ్. అప్పుడే ఇన్ని ‘టేకులా’!
 
‘ది కోర్స్ ఆఫ్ ట్రూ లవ్ నెవర్ డిడ్ రన్ స్మూత్’... తలపండిన షేక్‌స్పియర్ ఇన్‌స్పిరేషన్ ఇస్తాడనుకుంటే తొలి షాట్‌లో ఇంతలా షాకిచ్చాడేమిటి! ‘లవ్ లవ్స్ టు లవ్’... జేమ్స్ జాయ్స్ చెప్పేదాంట్లో అంతా లవ్వే గానీ, మనమెక్కడ! ‘యువార్ మై లవ్... యువార్ ది వన్ ఫర్ మి రైట్ నౌ... యువార్ మై సాంగ్ ఐ విల్ సింగ్ ఫరెవర్’... హమ్! నువ్వే నా ప్రేమంటాడు... మళ్లీ పాటంటాడు. ఇంతకీ ఎవరెవరు? క్లారిటీ మిస్సవుతుంది! ‘లవ్వంటే కేరింగ్... ఫ్రెండంటే షేరింగ్... ఎట్టుందే పిల్లా బోలో నా ఫ్రేమింగ్’... అబ్బో... వీడు బాగా ముదురులా ఉన్నాడు సుమీ! ఏదంటే దానికి రెడీ అంటున్నాడు. ఎటు కావాలంటే అటు స్టీరింగ్ కూడా తిప్పేస్తాడట! ‘ధీరే ధీరేసే మేరే జిందగీ మే ఆనా... ధీరే ధీరేసే మేరే దిల్ కో చురానా’... వాహ్ ఇది కదా అసలు ఎక్స్‌ప్రెషన్! ఈ నిదానమే ప్రధానం హైవే మీద ఓకే... మరి లైఫ్‌లో వర్కవుట్ అవుతుందా? ‘జబ్‌సే తుమ్ కో దేఖా దిల్ కో కోయీ ఆరామ్ నహీ’ అంటూ తెగ ఫీలవుతున్నాడు. మళ్లీ మన పనీ అంతేనా! ‘కళ్లూ కళ్లూ ప్లస్సూ వాళ్లు వీళ్లూ మైనస్... ఒళ్లు ఒళ్లు ఇన్టూ చేసేస్తే ఈక్వేషన్’ అమ్మనీ..! వీళ్ల సూత్రాలు లెక్కల బుక్కులో పెట్టా! మ్యాథ్స్, ఫిజిక్స్ కలిపి కొట్టేసి కొత్త కెమిస్ట్రీతో అయస్కాంతంలా తెగ ఆకర్షించేసుకుంటున్నారే! మన రూటిది కాదులే... జస్ట్ ఇంకో లుక్కేద్దాం. ‘ఎడమ భుజము కుడి భుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం... పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం’ మా మాస్టారూ ఉన్నాడు ఎందుకు! త్రికోణాలు అటూ ఇటూ తిప్పాడు గానీ... ఎప్పుడన్నా ఇలా ‘భుజాలు’ కలవనిచ్చాడా! అయినా... 100 పర్సంట్ లవ్‌లో నిజంగా ఇన్ని ‘ఈక్వేషన్లు’ వర్కవుటవుతాయా! ‘కన్నులదా ఆశలదా... బుగ్గలదా ముద్దులదా... పెనవేసుకున్న పెదవులదా’ ఇక్కడేదో మొగలి పొద రగులుతున్నట్టున్నదే! అటు వెళ్తే ఆ ఫైర్‌లో మనం బూడిదైపోవడం ఖాయం. ‘కన్నుల బాసలు తెలియవులే... కన్నెల మనసులు ఎరుగములే.. ఒక వైపు చూపి మరు వైపు దాచగ అద్దాల మనసు కాదులే’... వాడే నయం ‘ఖుషీ’గా దొరికింది దొరికినట్టు ఎంజాయ్ చేసేస్తున్నాడు. వీడు మరీ విరహంలో మునిగిపోతున్నాడు. ప్రేమిస్తే అంతేనా! మనకూ ఇలాంటి వర్షం సీన్లు తప్పవా! ఆ.. అన్ని కథలూ ఒకేలా ఎందుకుంటాయిలే! ఇంతకీ నాది.. ప్రేమ దారా? ‘ప్రేరేపించే’ దారా? ‘రీల్’ తిరుగుతున్న కొద్దీ మైండ్ బ్లాకవుతోంది. ‘ది హార్ట్ వజ్ మేడ్ టు బీ బ్రోకెన్’... ఆస్కార్ వైడ్ మరీ వైడ్‌గా చెబుతున్నాడా! ప్రేమతో పెట్టుకుంటే కన్‌ఫ్యూజనే ఎక్స్‌ప్రెషనై పిచ్చెక్కుతోంది తప్ప క్లారిటీ రావడం లేదు. ఇంతకీ నేనెవరు!
 డోన్ట్ డిస్ట్రబ్ ది లవ్... బికాజ్ లవ్ లవ్స్ ది లవ్
 ఇఫ్ యు డిస్ట్రబ్ ది లవ్.. ఇట్ డిస్ట్రబ్స్ యు మోర్
 బట్ అయామ్ నాట్ ది లవ్... అయామ్ ది ట్రూత్! హెహెహేహే!
 
- హనుమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement