ఆకార్ పటేల్
అవలోకనం
ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ మూడు రంగాల్లోనూ భారత్ జట్టు అసాధారణమైన ఆటతీరును కనబర్చింది. బంగ్లాదేశ్‌తో ముగిసిన క్వార్టర్ ఫైనల్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను నోబాల్‌గా ప్రకటించడంలో కుట్ర జరిగిందన్న ఆరోపణ కాస్త అతిగా ఉందనే చెప్పాలి.
కామన్వెల్త్ దేశాలు అసాధారణంగా వ్యవ హరిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద విషయాల్లో మనం మన వైఫల్యా లను, ఓటములను అల వోకగా అంగీకరిస్తుం టాం. మన సమాజాలు పేదవి, నిరక్షరాస్యతతో కూడుకున్నవనీ, చాలావరకు ఇవి అనాగరికమై నవనీ, తరచుగా అప్రజాస్వామికంగా ఉంటాయని అంగీకరించడంలో భారతీయులు, పాకిస్తానీయు లు, బంగ్లాదేశీయులూ మొదటివరుసలో ఉంటారు. అయితే ఎక్కడో ఒకచోట మనం దీన్ని అతిక్రమిస్తుం టాం. సాధారణంగా క్రికెట్ విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. క్రికెట్‌కి సంబంధించి మనం కొన్ని సందర్భాల్లో అవలంబించే వైఖరి ఆమోద నీయం కాదు. శ్రీలంక టెస్ట్ క్రికెట్ ఆడే దేశంగా ఆవిర్భవించి, భారత్‌తో తన తొలి మ్యాచ్ ఆడటం నాకు గుర్తుంది. భారత్‌తో పోలిస్తే రమేష్ రత్నా యకే, అశాంతె డి మెల్ వంటి ఫాస్ట్ బౌలర్లతో, కొద్ది మంది గొప్ప బ్యాట్స్‌మెన్‌లతో వారు గట్టి జట్టుగా కనిపించేవారు.
దాదాపు 30 ఏళ్లకు ముందు శ్రీలంకలో జరిగిన తొలిటెస్టు పర్యటనలో (నేను పొరపడనట్లయితే, కపిల్‌దేవ్ సంధించిన తొలి బంతిని అరవింద డిసి ల్వా సిక్స్‌గా మలచినట్లు గుర్తు) కపిల్‌దేవ్ అంపై రింగ్‌పై ఎంత ఆగ్రహం వ్యక్తపరిచాడంటే, లంకే యులు తమ దేశం వెలుపల ఎన్నటికీ విజయం సాధించలేరని ప్రకటించాడు. అయితే తన ప్రకటన తప్పు అని తెలుసుకోవడానికి కపిల్‌కు అట్టే సమ యం పట్టలేదు. కానీ ఆక్షణంలో మాత్రం తన నాయకత్వంలోని బలమైన భారత్ జట్టును అంగుష్ట మాత్రపు పొరుగుదేశం ఓడించవచ్చన్న వాస్తవాన్ని కపిల్ అంగీకరించలేకపోయాడు.
మనం ప్రస్తుత ప్రపంచ కప్ విషయానికి వద్దాం. పూర్తిగా ఏకపక్షంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో, బ్యాటింగ్‌తో పోలిస్తే పేలవంగా కనిపించే భారతీయ బౌలింగ్ అసాధార ణమైన ఆటతీరుతో మెప్పించింది. అటు ఫీల్డింగ్ లోనూ, అటు బ్యాటింగ్‌లోనూ ప్రత్యర్థి జట్టుపై మొత్తం నూరు ఓవర్లలో ఆధిక్యత చూపడంలో మన బౌలర్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. క్వార్టర్ ఫైనల్‌లోనూ ఇదే జరిగింది. భారతీయ ఇన్నింగ్స్ మధ్యలో వికెట్లు కోల్పోనప్పటికీ రన్ రేట్ ఒక్కసారిగా పడిపోవడం మినహాయిస్తే, భారత్ ఆట మొత్తంలో ఆధిక్యత కనబర్చింది.
కానీ ఆట ముగిశాక బంగ్లాదేశ్ పత్రికలను చూసినట్లయితే, వారి జట్టుకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని అవి రాశాయి. ’బంగ్లాదేశ్ సెమీస్ ఆశల్ని ఘోరంగా దెబ్బతీసిన వివాదాస్పదమైన అం పైరింగ్’ ఇది బంగ్లాదేశ్ అతిపెద్ద జాతీయ వార్తా పత్రిక డైలీ స్టార్ పెట్టిన ప్రధాన శీర్షిక. రోహిత్ శర్మ 91 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు రుబెల్ హుసేన్ ఫుల్ టాస్ బంతితో లభించిన క్యాచ్‌ని అంపైర్ నోబాల్‌గా ప్రకటించడం మ్యాచ్‌ని మలుపు తిప్పిం దని బంగ్లా పత్రిక వ్యాఖ్యానించింది. అంపైర్ నిర్ణయంతో బతికిపోయిన రోహిత్ మరో 46 పరు గులు చేయగలిగాడు. భారత్ జట్టు బ్యాటింగ్ ఆ దశలో ఉన్న తీరును పరిశీలిస్తే ఈ అంపైరింగ్ లోపం వల్ల బంగ్లాకు పెద్దగా ఒనగూరేదేమీ లేదు.
రీప్లేని చూపించినప్పుడు, అంపైర్ ఇయాన్ గౌల్డ్ తప్పు నిర్ణయం చాలా స్పష్టంగా కనిపించింది. బ్యాట్స్‌మన్ బ్యాట్‌తో బంతిని తాకినప్పుడు అది తక్కువ ఎత్తులో ఉండటం పదేపదే రీప్లేలో కనిపిం చింది. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా లెగ్ ఎంపైర్ నిర్ణయం వెలువరించాల్సి ఉండగా, ఆ స్థానంలో ఉన్న అలీమ్ దార్ మౌనంగా ఉండిపో వడం బంగ్లా జట్టు అభిమానులకు మిస్టరీగా కనబడింది.
ఇతరులు సైతం దీన్ని తప్పుగానే భావించారు. భారత్ మాజీ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్ సైతం దీనిపై ట్వీట్ చేస్తూ, ‘గౌల్డ్‌ది తప్పు నిర్ణయం. బంతి ఆ సమయంలో ఖచ్చితంగా నడుము పైభాగంలో ఎగరలేదు. రోహిత్ నిజంగానే ఊపిరి పీల్చుకున్నట్ల యింది. అదనంగా 20 పరుగులు రావడానికి ఇది దోహదం చేస్తుంది’ అని పేర్కొన్నాడు.
అంపైర్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటారన్నది వాస్తవం. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, ఉమేష్ యాదవ్ వేసిన మొట్టమొదటి ఓవర్ నాలు గో బంతికే ఇమ్రుల్ కేస్ కాట్ బిహైండ్ రూపంలో ఔటయ్యాడు. స్నికోమీటర్ దాన్ని స్పష్టంగా చూపిం చింది కూడా. కాని అప్పీల్‌కు అంపైర్ స్పందిం చలేదు. అంపైరింగ్ లోపాల గురించి విషం కక్కు తున్నప్పుడు బంగ్లాదేశీ పత్రికలకు ఈ విషయం గుర్తుకు రాకపోవడం సహజమే.
నిజానికి ఈ విషయంలో గౌల్డ్ తప్పు లేకపో వచ్చు. పైగా అది నో బాల్ అని ప్రకటించింది కూడా తను కాదు. స్క్వేర్ లెగ్‌లో ఉన్న అంపైర్ దార్ వెనువెంటనే నో బాల్ అని సంకేతమిచ్చాడు (అప్పటికి రోహిత్ షాట్ ఇంకా క్యాచ్ కాలేదు). ఆ బంతి నడుముకు పైభాగంలో వచ్చిందని దార్ తప్పుగా భావించి ఉండవచ్చు. (వాస్తవానికి అది నడుముకు కొన్ని అంగుళాల కిందే వచ్చింది), కానీ దీనిలో కుట్రకు అవకాశమే లేదు. ఏదేమైనా నేను తొలి పేరాలోనే చెప్పినట్లు ఇది క్రికెట్. బంగ్లాదేశీ యులు మైదానంలోని స్టాండ్‌లలో ఒక బ్యానర్‌ను ప్రదర్శించేశారు. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అని ఆ బ్యానర్ చూపించింది.
అయితే ఇలాంటి సూత్రీకరణ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా నుండి రావడం గమనార్హం. ‘వెల్‌డన్ ఐసీసీ (ఇండియన్ క్రికెట్ కౌన్సిల్), మీరు పూర్తిగా అమ్ముడుపోయారు!!’
అంపైర్ నిర్ణయం మిస్టరీగా ఉందన్న ప్రాతి పదికనే రమీజ్ అమ్ముడుపోవడం అనే పదాన్ని వాడారు. అతనొక్కడే కాదు. షోయబ్ అక్తర్ కూడా ఇలాగే ట్వీట్ చేశాడు. ‘పాపం, బంగ్లాదేశ్ బాగా ఆడింది. ఈ మ్యాచ్‌లో వంచన జరిగింది. కానీ ఈసారి...’ కానీ మోసం చేసిందెవరు? దీన్ని మా త్రం ఎవరూ చెప్పడం లేదు. తాను కొంత అతిగా వ్యవహరించినట్లు రమీజ్ తర్వాత గుర్తించాడు కాబోలు... (లేదా భారత్ ట్వీటర్ సేన నుంచి వెల్లు వెత్తిన విమర్శల ప్రభావం వల్ల కూడా కావచ్చు) తర్వాత ఇలా ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన ఆట. అద్భుత ప్రదర్శన. 7 వరుస విజయాలు సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు’
కానీ బంగ్లాదేశ్‌లో తాము గెలవాల్సిన చోట మోసపోయామన్న భావం ఇప్పటికీ బలంగా వినిపి స్తోంది. ఐసీసీ వివాదాస్పదమైన అంపైరింగ్‌పై బం గ్లాదేశ్ అప్పీల్‌కు సిద్ధం అనీ, యుద్ధనేరాలకు గాను ఐసీసీని విచారించాలి అనీ బంగ్లాదేశ్ పత్రికలు అనేక పతాక శీర్షికలలో ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నా యి. ఇది కాస్త అతిగా ఉందని నా అభిప్రాయం. ఆ నిర్దిష్ట కథనాన్ని నేను చదివినప్పుడు అది అంతర్జా తీయ క్రిమినల్ కోర్టుకు వెళ్లాలని సూచిస్తోంది.
నేను మెల్లగా ఆ పేజీని తిరగేశాను. బంగ్లాదేశ్ అభిమానులు కూడా అలాగే చేయడం మంచిది.
(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
ఈమెయిల్:aakar.patel@icloud.com