
ఎటర్నల్ ఎన్‌లైట్‌మెంట్...
బుద్ధ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 44 మంది చిత్రకారులు గీసిన బుద్ధుడి చిత్రాలను ‘ఎటర్నల్ ఎన్‌లైట్‌మెంట్’ అనే పేరుతో ఎగ్జిబిషన్ బాగ్‌లింగంపల్లిలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్టులు గీసిన చిత్రాలు ఇందులో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ నెల 20 వరకు జరగనున్న ఈ ప్రదర్శనను మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులు వీక్షించవచ్చు.