
మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? గ్యాస్ సమస్య, పదేపదే తేన్పులు వస్తూ, కడుపుబ్బరంగా ఉంటోందా? జీర్ణకోశ సమస్యలతో విపరీతమైన ఒత్తిడి చెందుతున్నారా? అప్పుడేం చేస్తారు.... మెడికల్ షాప్‌కి వెళ్ళి ఏ టాబ్లెట్లో తెచ్చుకుంటారు లేదా డాక్టర్‌ని అడిగి మందు వేసుకుని ఉపశమనం పొందుతారు. కానీ దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడాలంటే ఇది సరిపోదు. సరైన పోషకాహారం తీసుకుంటూ, అవసరమైన మందులు వేసుకుంటూనే ఈ సమస్యకు మూలకారణాన్ని తొలగించాలి. పెద్దపేగులో పేరుకున్న మలినాలను తొలగించడమే దీనికి ఆ పరిష్కారం. ఇందుకు ఉపయోగపడే కోలన్ హైడ్రోథెరపీ.
జీర్ణక్రియ, విసర్జన క్రియలు సక్రమంగా జరుగుతున్నప్పుడే ఏ మనిషైనా ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండగలుగుతాడు. రోజంతా ఆహ్లాదంగా గడవాలంటే వీటిలో ఎటువంటి సమస్యలు ఉండకూడదు. అయిదు అడుగుల పొడవుతో ఉండే పెద్దపేగు విసర్జనక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. కోలన్‌ని శుభ్రపరచడం అనే విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటినుంచో ఉంది. మనదేశంలో కూడా ఇది ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం సంతరించుకుంటున్నది.
ఎలా పనిచేస్తుంది?
కోలన్ హైడ్రోథెరపీలో నీరు వివిధ దశల్లో ఫిల్టర్ అవుతుంది. అంతేగాక అల్ట్రా వయొలెట్ వాటర్ ప్యూరిఫికేషన్ ద్వారా నీరు శుభ్రమవుతుంది. ఆ తరువాతే రెక్టమ్ ద్వారా లోపలికి వెళ్లి, ఆ నీరు నెమ్మదిగా పెద్దపేగును చేరుతుంది. సురక్షితమైన, స్వచ్ఛమైన, నియంత్రిత ఉష్ణోగ్రతతో నీరు పెద్దపేగును చేరుతుంది. గోరువెచ్చని (37.5 డిగ్రీ) నీరు పెద్దపేగును చేరగానే సహజసిద్ధంగా మలినాలతో సహా బయటకు వచ్చేస్తుంది.
మృదువుగా మారిన మలినాలన్నీ కింద ఉన్న కోలన్ హైడ్రోథెరపీ టేబుల్ కిందకు చేరుతాయి. ఇదంతా పూర్తవడానికి 40 నిమిషాల సమయం పడుతుంది. వాసనను బయటికి పంపించే వ్యవస్థ కూడా దీనిలో ఉంటుంది. కాబట్టి చికిత్స జరిగేటప్పుడు ఎటువంటి దుర్వాసన రాదు. ఈ ప్రక్రియ కోసం ఒక వ్యక్తికి ఒక డిస్పోజబుల్ రెక్టల్ నాజిల్‌ను ఉపయోగిస్తారు. ఈ చికిత్స చేయించుకోవడానికి రెండు గంటల ముందు వరకు ఏమీ తినకూడదు. కోలన్ హైడ్రోథెరపీ ఎన్నిసార్లు చేయించుకోవాలనేది పేషెంటు ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ చికిత్స ఇప్పుడు వారానికి ఒక రోజు నెలలో 5 సార్లు ఒక ప్యాకేజిగా అందుబాటులో ఉంది. వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎటువంటి సమస్య లేనివాళ్లు కూడా కోలన్ హైడ్రోథెరపీ చేయించుకోవచ్చు.
ఇవీ ఫలితాలు...
మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలినాలతో పాటు హానికర బ్యాక్టీరియా వెళ్లిపోతాయి. కాబట్టి సంపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నొప్పిలేని, సురక్షిత చికిత్సా పద్ధతి.
వీరిలో ప్రతికూల సంకేతాలు
గర్బిణులు, పెద్దపేగు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌కి
సంబంధించిన తీవ్రమైన సమస్యలున్నవాళ్లు.
హార్‌ట ఫెయిల్యూర్ సమస్య ఉన్నవాళ్లు
రెక్టల్ క్యాన్సర్ ఉన్నవాళ్లు అల్సరేటివ్ కోలైటిస్
తీవ్రమైన ైపైల్స్ (అర్శమొలలు) సమస్య ఉన్నవాళ్లు
కోలన్ థెరపీ యంత్రాలను కూడా ఇక్కడ తయారుచేస్తున్నారు. హాస్పిటల్, నర్సింగ్ హోమ్స్, స్లిమ్మింగ్ సెంటర్లు, స్పాలు... ఎవరికి అవసరమున్నా సప్లయి చేస్తున్నారు.
రాజగోపాల్
డెరైక్టర్ శుద్ధ్ కోలన్ కేర్
mail id: info@shuddhcoloncare.com
website: www.shuddhcoloncare.com
అడ్రస్
shuddh colon care
opp GVK entry gate
Road No. 4, Banjara Hills
hyderabad
8008002032, 8008002033