Gastrointestinal problems
-
Antimicrobial Resistance: యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌తో ముప్పు
ఆక్స్ఫర్డ్(యూకే): కంటికి కనిపించని సూక్ష్మమైన బ్యాక్టీరియా, వైరస్లు, పారాసైట్లు, ఫంగస్ వంటివి మనిషి శరీరం లోపల, బయట, చుట్టూ ఉంటాయి. వీటిని మైక్రోబ్స్ అని పిలుస్తుంటారు. మన నిత్య జీవితంలో ఇవన్నీ ఒక భాగమే. కొన్ని రకాల జీవ క్రియలకు మైక్రోబ్స్ అవసరం. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి బ్యాక్టీరియా, వైరస్లు తోడ్పడుతుంటాయి. వ్యవసాయం, పరిశ్రమల్లోనూ వీటి ప్రాధాన్యం ఎక్కువే. అయితే, ఈ మైక్రోబ్స్ కేవలం మేలు చేయడమే కాదు, కొన్ని సందర్భాల్లో కీడు చేస్తుంటాయి. అనారోగ్యం కలిగిస్తుంటాయి. మనుషులతోపాటు జంతువులు, మొక్కలకు హాని కలిగిస్తాయి. అందుకే యాంటీ మైక్రోబియల్ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి మైక్రోబ్స్‌ను అంతం చేయడం లేదా వాటిని వ్యాప్తిని తగ్గించడం చేస్తుంటాయి. కాలానుగుణంగా మైక్రోబ్స్ ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. అంటే టీకాలను లొంగకుండా తయారవుతాయి. అంతిమంగా ‘సూపర్‌బగ్స్’గా మారుతాయి. అప్పుడు టీకాలు, ఔషధాలు ప్రయోగించిన ఫలితం ఉండదు. ఈ పరిణామాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) అంటారు. ఈ ఏఎంఆర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 50 లక్షల మంది మరణిస్తున్నారని తాజాగా దక్షిణాఫ్రికా, యూకేలో జరిగిన అధ్యయనంలో వెల్లడయ్యింది. హెచ్ఐవీ/ఎయిర్స్, మలేరియా సంబంధిత మరణాల కంటే ఇవి చాలా అధికం. ఏఎంఆర్‌తో ఏటా మృత్యువాత పడే వారి సంఖ్య 2050 నాటికి ఏకంగా కోటికి చేరుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే క్యాన్సర్ సంబంధిత మరణాలను కూడా త్వరలో ఏఎంఆర్ మరణాలు అధిగమిస్తాయని అంటున్నారు. ► ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్స్ వాడకం మితిమీరుతోంది. ► 2000 నుంచి 2015 మధ్య ఇది 65 శాతం పెరిగిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ► మొత్తం యాంటీ మైక్రోబియల్స్ 73 శాతం ఔషధాలను ఆహారం కోసం పెంచే జంతువులపైనే ఉపయోగిస్తున్నట్లు తేలింది. ► ఇలాంటి జంతువులను భుజిస్తే మనుషుల్లోనూ మైక్రోబ్స్ బలోపేతం అవుతున్నాయని, ఔషధాలకు లొంగని స్థితికి చేరుకుంటున్నాయని నిపుణులు గుర్తించారు. ► యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమస్య కాదని, ఇది ప్రపంచ సమస్య అని నిపుణులు చెబుతున్నారు. ► దీనిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీబయోటిక్స్‌పై అధారపడడాన్ని తగ్గించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పేర్కొంటున్నారు. -
ఐబీడీపై ఏఐజీ అధ్యయనం
సాక్షి, సిటీబ్యూరో: పట్టణ ప్రాంతాలకే పరిమితమైన జీర్ణకోశ సంబంధిత వ్యాధి ఇన్ల్ఫమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ)గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డి.నాగేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తమ ఆసుపత్రి అధ్యయన ఫలితాలను ప్రతిష్టాత్మక లాన్సెట్ ప్రచురించిన నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 15 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా కాగా, తాము గ్రామాల్లో 30 వేల మంది బాధితులను గుర్తించడం ద్వారా అది గ్రామీణ ప్రాంతాలకు కూడా బాగా విస్తరించినట్టు వెల్లడైందన్నారు. తమ తొలి దశ అధ్యయనం ప్రకారం గ్రామీణుల్లో ఈ వ్యాధి 0.1 శాతం మాత్రమే కాగా రెండో దశలో 5.1 శాతానికి పెరిగిందన్నారు. శిశువులకు తల్లిపాలు అందకపోవడం, యాంటీబయాటిక్స్ వినియోగం...తో పాటు గ్రామాల్లోనూ ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరగడం, పాశ్చాత్య జీవనశైలి వంటివి గ్రామాల్లో ఐబీడీ విజృంభణకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఐబీడీ వ్యాప్తిపై ప్రతీఒక్కరిలో అప్రమత్తత అవగాహన పెరగాలన్నారు. సమావేశంలో ఏఐజీ ఆసుపత్రి ఐబీడీ సెంటర్ డైరెక్టర్, డాక్టర్ రూపా బెనర్జీ అధ్యయనం తీరుతెన్నులను వివరించారు. -
కడుపులో మంట వస్తుందా?.. లైట్ తీసుకోవద్దు.. షాకింగ్ విషయాలు
సాక్షి, గుంటూరు మెడికల్: ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటు పడడం, పాశ్చాత్య జీవన శైలికి అలవాటు పడడం, ఇంట్లో వంట తగ్గించేసి హోటళ్లలో సమయపాలన లేకుండా మసాలాలతో కూడిన ఆహారం అమితంగా తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను ప్రజలు కొని తెచ్చుకుంటున్నారు. జీర్ణకోశ వ్యాధులపై ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు ఏళ్ల తరబడి ఎడాపెడా మందులు వాడుతూ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకుంటూ చివరకు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఒకింత వ్యాధులపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రాథమిక దశలోనే జీర్ణకోశ వ్యాధులను కట్టడి చేయడంతోపాటు, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. సొంత వైద్యంతో మొదటికే మోసం.. అల్సర్ సోకగానే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై వైద్యుల సలహాలు పాటించకుండా ఇష్టానుసారంగా మందులు వాడేస్తుంటారు. అల్సరుకు నెలల తరబడి గ్యాస్ మాత్రలు వాడవలసిన అవసరం లేదు. అల్సర్‌కు కారణం కేవలం (యాసిడ్) కాదు. హెచ్. పైలొరి బ్యాక్టీరియా లేదా నొప్పి మాత్రల వల్ల అల్సర్ సోకుతోంది. అల్సరు తగ్గడానికి ఆ బ్యాక్టీరియా కోర్సు వాడితే సరిపోతోంది. అతిగా నొప్పి మాత్రలు వాడితే జీర్ణాశయానికి పుండ్లు పడతాయి. ఆ్రస్పిన్, నొప్పి మాత్రలు వాడుతున్న వారికి పొట్టనొప్పి, మంట వచ్చినా, నల్ల విరోచనాలు, నోటిలో రక్తం వచ్చినా వెంటనే ఎండోస్కోపి చేయించుకోవాలి. జీర్ణాశయ క్యాన్సర్‌ను గుర్తించండి ఫ్యాషన్ కోసం అలవాటు చేసుకునే చెడు వ్యసనాలు జీర్ణ కోశ వ్యాధులకు ముఖ్యంగా జీర్ణాశయ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. సిగరేట్, మద్యం సేవించడం వల్ల లివర్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. అతిగా మద్యం తాగితే క్లోమం దెబ్బతింటుంది. తీవ్రమైన పొట్టనొప్పి, వాంతులు, నడుం నొప్పి, షుగరు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు. సిగరెట్, మందు తాగేవారు. 50 సంవత్సరాల పైబడినవారు బరువు తగ్గుతున్నా, ఆకలిలేకున్నా, మింగటంలో ఇబ్బంది, రక్త హీనత, అతిగా వాంతులు ఉన్నా, వెంటనే గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించాలి. గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్లు తాగితే నోటి, జీర్ణాశయ క్యాన్సర్ వస్తుంది. ఆహారనాళం పూర్తిగా మూసుకు పోతుంది. నోటిద్వారా ఆహారం తీసుకోలేరు. ఈలక్షణాలు ఉన్నవారు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించాలి. పిల్లలకు చిల్లర ఇవ్వొద్దు పిల్లలు తినుబండారాల కొనుగోలు కోసం మారం చేసి డబ్బులు అడిగినప్పుడు ఎట్టిపరిస్థితుల్లో వారి చేతికి చిల్లర డబ్బులు ఇవ్వొద్దు. ముఖ్యంగా ఆటలు ఆడుకునే సమయంలో నోటిలో పట్టేంత చిన్న బొమ్మలు, వస్తువులు ఇవ్వవద్దు. తద్వారా పిల్లలు అమాయకత్వంతో వాటిని నోటిలో పెట్టుకుని మింగుతారు. కొన్ని సందర్భాల్లో అది గొంతులో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి తలెత్తే ప్రమా దం ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలకు ఏమీ తినిపించకుండా గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదిస్తే ఎండోస్కోపి ద్వారా చిల్లర నాణేలు, కడుపులో మింగిన వస్తువులు తొలగించవచ్చు. చదవండి: ఆహారంలో ఉప్పు తగ్గిస్తేనే... లేదంటే ఈ ముప్పు తప్పదు! ఆపరేషన్లు కొంత మందికి మాత్రమే.. ఈమధ్య బిజీ లైఫ్‌లో పడి సక్రమంగా మంచినీరు తీసుకోకపోవడం, త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోకపోవడం, జీర్ణం కావడానికి సరిపడా సమయం ఇవ్వకపోవడం ద్వారా పసరు తిత్తుల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. పసరుతిత్తిలో రాళ్లు ప్రతి 100మందిలో 10మందికి ఉంటాయి. వీరిలో 75 శా తం మందికి వీటివలన ఏ ఇబ్బందీ రాదు. కేవలం పొట్టనొప్పి, కామెర్లు వచ్చినవారికి మాత్రమే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. పసరు తిత్తి మార్గంలో రాళ్లు అడ్డుపడితే ఆపరేషన్ లేకుండా ఇ.ఆర్.సి.పి అను ఎండోస్కోపి పద్ధతిద్వారా తొలగించ వచ్చు. తక్కువ తినండి.. జీర్ణకోశ వ్యాధులు రావడానికి మితిమీరిన ఆహారం తీసుకోవడమే కారణమవుతోంది. తిన్న ఆహారం జీర్ణం కాక శరీర బరువు పెరిగిపోయి వ్యాయామం లేకపోవడంతో లివరులో కొవ్వు చేరే ప్రమాదం ఉంది. మద్యం బాగా తాగే వారికి వచ్చే లివరు జబ్బులన్నీ వీరికి రావచ్చు. తక్కువ తిని ఎక్కువగా నడవాలి. కోతకుట్టులేకుండా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా పొట్టలో ఎటువంటి గడ్డలు అయినా పరీక్షించి ముక్క పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. – డాక్టర్ షేక్ నాగూర్ బాషా, లివర్, జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు, గుంటూరు -
Gagandeep Kang: వాక్సినాలజిస్ట్ చల్లనమ్మ
థర్డ్ వేవ్ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది! కరోనా వ్యాప్తి ఈ నెల మధ్యలో తగ్గడం ప్రారంభించి, నెలాఖరుకు క్షీణ దశకు చేరుకుంటుందని గగన్‌దీప్ కాంగ్ అనే వ్యాక్సినాలజిస్ట్ గురువారం ఓ వెబినార్‌లో చెప్పారు! ఊరికే ధైర్యం చెప్పడం కోసం ఆమె ఆ మాట అనలేదు. నిరుడు మార్చి నెలలో దేశంలో కరోనా కేసులు అరవైకి చేరి, ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళనకు చేరువవుతున్న దశలో సైతం గగన్‌దీప్ మరీ బెంబేలెత్తి పోనవసరం లేదని భరోసా ఇవ్వడంతో పాటు కనీస జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అలెర్ట్ చేశారు మంచి మాటల చల్లనమ్మ గగన్ దీప్ కాంగ్! గగనదీప్ వైరాలజిస్ట్. వైరస్ల మీద పరిశోధనలు చేస్తుంటారు. ప్రస్తుతం వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌లో ‘గ్యాస్ట్రోఇంటెస్టెనల్ సైన్సెస్’ విభాగం ఫ్రొఫెసర్‌గా ఉన్నారు. బ్రిటన్‌లోని ‘రాయల్ సొసైటీ’ ఫెలోషిప్‌ను పొందిన తొలి భారతీయ మహిళ గగన్‌దీప్. అయితే ఆమె అసలైన గుర్తింపు మాత్రం ఐదేళ్ల చిన్నారులకు సోకే రోటా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తగానే! రోటా వైరస్ వల్ల వచ్చే డయారియాతో ఏటా లక్షమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయేవారు. ఆ వైరస్‌కు వ్యాక్సిన్‌తో అడ్డుకట్టవేశారు గగన్‌దీప్. ఏడాదిన్నరగా ఆమె కరోనా వైరస్ స్వభావాన్ని పరిశోధిస్తున్నారు. ఆ ఫలితాల గురించి ఉమెన్ ప్రెస్ కోర్స్ వెబినార్‌లో చెబుతున్నప్పుడే.. ‘‘ఇప్పుడు మేము పరిశీలిస్తున్న కరోనా వైరస్ గుణాలను బట్టి మే నెల మధ్య నుంచీ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి’’ అని గగన్‌దీప్ చెప్పారు. ∙∙ ఏ విషయాన్నైనా ‘భయం లేదు’ అన్నట్లే ప్రకటిస్తారు గగన్‌దీప్. అదే సమయంలో ‘నిర్లక్ష్యంగా ఉండేందుకూ లేదు’ అని భుజం తట్టినట్లు చెబుతారు. ‘‘శాస్త్రవేత్తలుగా మా దగ్గర పరిష్కారాలు ఉంటాయి. మీ దగ్గర జాగ్రత్తలు ఉండాలి’’ అంటారు. ఇప్పుడీ కరోనా పరిస్థితులకు చక్కగా సరిపోయే మాటే. భయం అక్కర్లేదు. కానీ అతి ధైర్యమూ పనికి రాదు. ఇక ఆమె చెప్పే ఏ మాటైనా మనం నిశ్చింతగా ఎందుకు నమ్మేయాలంటే.. తను వైరాలజిస్ట్, వాక్సినాలజిస్టు కూడా కాబట్టి. గగన్‌దీప్‌కు చిన్నప్పట్నుంచీ.. రూఢీ కానిదేదీ నమ్మదగినది కాదనే నమ్మకం ఉంది. ఆమె తండ్రి రైల్వేస్‌లో మెకానికల్ ఇంజనీరు. తల్లి ఇంగ్లిష్, మేథ్స్ సబ్జెక్టుల టీచర్. íసిమ్లాలో పుట్టారు గగన్‌దీప్. తండ్రి ఉద్యోగంలో ఉండే బదిలీల వల్ల పదో తరగతికి వచ్చేలోగా పది స్కూళ్లు మారారు. దేశమంతటా తిరిగి చదివినట్లు లెక్క. బయాలజీ, ఫిజిక్సు, కెమిస్ట్రీ ఆమెకు ఇష్టమైన పాఠ్యాంశాలు. తండ్రి చేత ఇంట్లోనే ఒక ల్యాబ్ ఏర్పాటు చేయించుకుని పరిశీలనలు, ప్రయోగాలు చేస్తుండేవారు. ఆ ఆసక్తే ఆమె చేత మెడిసిన్ చదివించింది. మైక్రో బయాలజీలో పీహెచ్డీ చేయించింది. ఇక పలు రకాలైన వైరస్లు, బాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను నివారించేందుకు ఆమె చేసిన పరిశోధనలు, వాక్సిన్లు కనిపెట్టేందుకు చేసిన కృషి ఆమెకు 2019లో రాయల్ సొసైటీ గౌరవాన్ని సాధించిపెట్టాయి. గగన్‌దీప్ ప్రస్తుతం వెల్లూరులో ప్రొఫెసర్‌గా ఉంటూనే కరోనాను ఎదుర్కొనే విషయంలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు సలహాదారుగా ఉన్నారు. -
గ్యాస్ట్రిక్ అల్సర్ నయమవుతుందా?
నా వయసు 37 ఏళ్లు. ఇటీవల కడుపులో తీవ్రంగా మంట వస్తోంది. వికారంగా కూడా ఉంటోంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అల్సర్ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణాశయంలో అల్సర్లు పెరుగుతాయి. కారణాలు : 80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి. ►చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది. ►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ►మద్యపానం, పొగతాగడం ►వేళకు ఆహారం తీసుకోకపోవడం ►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు : కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ►నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు: పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ►మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ►కంటినిండా నిద్రపోవాలి ►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స : గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మైగ్రేన్‌కు చికిత్స ఉందా? నా వయసు 33 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపున విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. హోమియో మందులతో ఇది తగ్గుతుందా? పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ. కారణాలు: తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన సువాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు: పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. ►పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు: ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్ల ముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. ►పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. ►పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు : చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స / నివారణ : కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ శస్త్రచికిత్స లేకుండా యానల్ ఫిషర్ తగ్గుతుందా? నా వయసు 67 ఏళ్లు. మలవిసర్జన టైమ్‌లో తీవ్రంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మలద్వారం దగ్గర చీరుకుపోయిందనీ, ఇది యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేకుండానే హోమియోలో దీనికి చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈ మధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స : ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
కడుపులో మంట....
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. నేను కెమికల్ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ మేనేజర్‌ను. కడుపులో మంట, వికారం వంటి లక్షణాలు కనిపిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. ఎండోస్కోపీ చేయించి అల్సర్ అన్నారు. దీనికి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉందా? - అనిల్‌కుమార్, హైదరాబాద్ మన జీవనశైలిలోని ఒక ప్రధాన అంశమైన ఆహారపు అలవాట్లతో జీర్ణకోశ సమస్యలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో గ్యాస్ట్రిక్ అల్సర్ ఒకటి. మన శరీరంలో నిర్ణీత పరిమాణాల్లో ఆమ్లం (యాసిడ్) ఉండటం అవసరం. అది ఎక్కువతేనే కాకుండా తక్కువైనా అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్‌ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. హెరికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఉత్పత్తికి కూడా దోహదం చేస్తుంది. ఫలితంగా జీర్ణాశయ అల్సర్లు మొదలవుతాయి. కారణాలు : పైన పేర్కొన్న బ్యాక్టీరియాతో పాటు మరికొన్ని అంశాలు కూడా కడుపులో అల్సర్లకు కారణం. అవి...మానసిక ఒత్తిడి కారం మసాలాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు సమాయానికి ఆహారం తీసుకోకపోవడం లక్షణాలు : కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం తలనొప్పి, బరువు తగ్గడం, రక్తపు వాంతులు, రక్తవిరేచనాలు కొద్దిగా తిన్నా కడుపు నొప్పిగా ఉండటం నోటిలోకి నీరు ఎక్కువగా ఊరుతుండటం వ్యాధి నిర్ధారణ : ఎక్స్‌రే, రక్తపరీక్షలు, బయాప్సీ వంటి చికిత్స : గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియో విధానంలో జీర్ణకోశ సంబంధతి పరిశోధనలు చేసే ప్రత్యేక విభాగం ఉంది. చికిత్సతో పాటు ఆహార సంబంధిత సలహాలతో వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. ఆర్సినిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. వీటిని అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. బీపీ పెరుగుతోంది... మందులు వాడాల్సిందేనా! నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు గానీ... ఈ మధ్య జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఆయన పరీక్షలు చేశారు. అప్పుడు నా బీపీ 170/120 ఉందనీ, మందులు వాడాలని చెప్పారు. మందులు వాడకుండా ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? - ప్రసాద్, నిజామాబాద్ మీ వయసు వారికి ఏ కారణం లేకుండా హైపర్‌టెన్షన్ (బీపీ సమస్య) రావడం చాలా అరుదు. కానీ నలభై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు (కిడ్నీలకు) సంబంధించిన సమస్య ఏదైనా ఉందా అని చూడాలి. దీనికోసం ఒకసారి మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్, క్రియాటినిన్ వంటి పరీక్షలతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఇతర పరీక్షలూ చేయించుకోండి. వాటి ద్వారా అసలు మీకు బీపీ అంతగా పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. బయటకు కనిపించేలా ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఆహారంలో ఉప్పు చాలా తగ్గించి వాడటం అవసరం. ఇక స్థూలకాయం ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి. నా వయసు 58 ఏళ్లు. విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. తట్టుకోలేక నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - ప్రతాప్‌రెడ్డి, వరంగల్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఫిజియోథెరపీ వంటి ఇతర పద్ధతులతో నొప్పి తగ్గించుకోడానికి ప్రయత్నించండి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగండి. మీ భుజం నొప్పి తగ్గడం కోసం ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. మీ అంతట మీరే మందులు వాడకండి. నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారీ రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - ఎమ్. సతీష్ బాబు, విజయవాడ మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీక్ష కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మలిన శుద్ధితో మంచి ఆరోగ్యం
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? గ్యాస్ సమస్య, పదేపదే తేన్పులు వస్తూ, కడుపుబ్బరంగా ఉంటోందా? జీర్ణకోశ సమస్యలతో విపరీతమైన ఒత్తిడి చెందుతున్నారా? అప్పుడేం చేస్తారు.... మెడికల్ షాప్‌కి వెళ్ళి ఏ టాబ్లెట్‌లో తెచ్చుకుంటారు లేదా డాక్టర్ని అడిగి మందు వేసుకుని ఉపశమనం పొందుతారు. కానీ దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడాలంటే ఇది సరిపోదు. సరైన పోషకాహారం తీసుకుంటూ, అవసరమైన మందులు వేసుకుంటూనే ఈ సమస్యకు మూలకారణాన్ని తొలగించాలి. పెద్దపేగులో పేరుకున్న మలినాలను తొలగించడమే దీనికి ఆ పరిష్కారం. ఇందుకు ఉపయోగపడే కోలన్ హైడ్రోథెరపీ. జీర్ణక్రియ, విసర్జన క్రియలు సక్రమంగా జరుగుతున్నప్పుడే ఏ మనిషైనా ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండగలుగుతాడు. రోజంతా ఆహ్లాదంగా గడవాలంటే వీటిలో ఎటువంటి సమస్యలు ఉండకూడదు. అయిదు అడుగుల పొడవుతో ఉండే పెద్దపేగు విసర్జనక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. కోలన్‌ని శుభ్రపరచడం అనే విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటినుంచో ఉంది. మనదేశంలో కూడా ఇది ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. ఎలా పనిచేస్తుంది? కోలన్ హైడ్రోథెరపీలో నీరు వివిధ దశల్లో ఫిల్టర్ అవుతుంది. అంతేగాక అల్ట్రా వయొలెట్ వాటర్ ప్యూరిఫికేషన్ ద్వారా నీరు శుభ్రమవుతుంది. ఆ తరువాతే రెక్టమ్ ద్వారా లోపలికి వెళ్లి, ఆ నీరు నెమ్మదిగా పెద్దపేగును చేరుతుంది. సురక్షితమైన, స్వచ్ఛమైన, నియంత్రిత ఉష్ణోగ్రతతో నీరు పెద్దపేగును చేరుతుంది. గోరువెచ్చని (37.5 డిగ్రీ) నీరు పెద్దపేగును చేరగానే సహజసిద్ధంగా మలినాలతో సహా బయటకు వచ్చేస్తుంది. మృదువుగా మారిన మలినాలన్నీ కింద ఉన్న కోలన్ హైడ్రోథెరపీ టేబుల్ కిందకు చేరుతాయి. ఇదంతా పూర్తవడానికి 40 నిమిషాల సమయం పడుతుంది. వాసనను బయటికి పంపించే వ్యవస్థ కూడా దీనిలో ఉంటుంది. కాబట్టి చికిత్స జరిగేటప్పుడు ఎటువంటి దుర్వాసన రాదు. ఈ ప్రక్రియ కోసం ఒక వ్యక్తికి ఒక డిస్పోజబుల్ రెక్టల్ నాజిల్‌ను ఉపయోగిస్తారు. ఈ చికిత్స చేయించుకోవడానికి రెండు గంటల ముందు వరకు ఏమీ తినకూడదు. కోలన్ హైడ్రోథెరపీ ఎన్నిసార్లు చేయించుకోవాలనేది పేషెంటు ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ చికిత్స ఇప్పుడు వారానికి ఒక రోజు నెలలో 5 సార్లు ఒక ప్యాకేజిగా అందుబాటులో ఉంది. వెల్నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎటువంటి సమస్య లేనివాళ్లు కూడా కోలన్ హైడ్రోథెరపీ చేయించుకోవచ్చు. ఇవీ ఫలితాలు... మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలినాలతో పాటు హానికర బ్యాక్టీరియా వెళ్లిపోతాయి. కాబట్టి సంపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నొప్పిలేని, సురక్షిత చికిత్సా పద్ధతి. వీరిలో ప్రతికూల సంకేతాలు గర్బిణులు, పెద్దపేగు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌కి సంబంధించిన తీవ్రమైన సమస్యలున్నవాళ్లు. హార్ట ఫెయిల్యూర్ సమస్య ఉన్నవాళ్లు రెక్టల్ క్యాన్సర్ ఉన్నవాళ్లు అల్సరేటివ్ కోలైటిస్ తీవ్రమైన ైపైల్స్ (అర్శమొలలు) సమస్య ఉన్నవాళ్లు కోలన్ థెరపీ యంత్రాలను కూడా ఇక్కడ తయారుచేస్తున్నారు. హాస్పిటల్, నర్సింగ్ హోమ్స్, స్లిమ్మింగ్ సెంటర్లు, స్పాలు... ఎవరికి అవసరమున్నా సప్లయి చేస్తున్నారు. రాజగోపాల్ డెరైక్టర్ శుద్ధ్ కోలన్ కేర్ mail id: info@shuddhcoloncare.com website: www.shuddhcoloncare.com అడ్రస్ shuddh colon care opp GVK entry gate Road No. 4, Banjara Hills hyderabad 8008002032, 8008002033