డ్యాన్స్ స్పాట్
ఇది కార్పొరేట్ ప్రపంచం. చదువు, కొలువే కాదు.. డ్యాన్స్, ఇతర ఆటపాటల్లో ఎంతో కొంత ప్రావీణ్యం ఉంటే గానీ నలుగురిలో గుర్తింపు, మనసుకు ఉల్లాసం ఉండవు. పైగా విద్యా సంస్థలు, హైటెక్ కంపెనీల్లో ఇప్పుడిలాంటి యాక్టివిటీస్ సర్వసాధారణం అయ్యాయి. అందుకే సదరు సంస్థలు డ్యాన్స్ వంటి వర్క్‌షాపులు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీ కూడా తమ విద్యార్థుల కోసం ఇలాంటి వర్క్‌షాపే నిర్వహిస్తోంది. యష్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో 14 రోజులు జరిగే ఈ శిక్షణా శిబిరంలో హిప్‌హాప్, సల్సా తదితర నృత్యరీతులు నేర్పిస్తున్నారు. విద్యార్థులూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
సాక్షి, సిటీ ప్లస్