రాజ్యాశ్రమ ముని | Raghu Vamsam | Sakshi
Sakshi News home page

రాజ్యాశ్రమ ముని

Published Sun, Jan 25 2015 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

రాజ్యాశ్రమ ముని

రాజ్యాశ్రమ ముని

 జ్యోతిర్మయం
 రఘు వంశానికి చెందిన రాజుల చరిత్రను ‘రఘు వంశం’ అనే పేరుతో కావ్యంగా మలిచాడు కవికుల తిలకుడైన కాళిదాసు. దిలీప మహారాజు చరిత్రతో మొదలవుతుంది కావ్యం. దిలీపుడి భార్య పేరు సుద క్షిణ. వారికి చాలా కాలం పిల్లలు కలగలేదు. కారణం ఏమా అని తెలుసుకోవటానికి భార్యా సమేతంగా దిలీ పుడు గురువైన వశిష్ఠుడి దగ్గరకు బయలుదేరతాడు. ఆ గురువు దూరంగా అడవిలో ఆశ్రమం కట్టుకొని అక్కడ తపస్సు చేసుకొంటున్నాడు. దిలీపుడు రథం మీద వెళ్తూ దార్లో చాలా ఊళ్లు దాటుకొంటూ వెళ్లా డు. మధ్యమధ్యలో ప్రకృతి అందాలు చూస్తూ గ్రామ స్తుల్ని పలకరిస్తూ వెళ్లాడు. పగలల్లా ఆ విధంగా ప్రయాణం చేసి సాయంకాలానికి వశిష్ఠుల వారి ఆశ్ర మం చేరుకొన్నాడు. అక్కడున్న మునుల చేత అతిథి సత్కారాలు పొంది, దిలీపుడు అతని భార్యా మార్గా యాసం నుండి తేరుకొన్నారు. తరు వాత ఇద్దరూ వెళ్లి వశిష్ఠుల వారికి, వారి భార్య అరుంధతికి నమస్కరిం చారు. ముని దంపతులు రాజదంప తుల్ని సంతోషంగా ఆశీర్వదించారు. తర్వాత వశిష్ఠుడు దిలీపుని రాజ్యంలో అందరూ క్షేమ మేనా అని అడిగాడు. ఇంత వరకు కథ మామూలుగా నడుస్తుంది. చెప్పుకోదగ్గ విశేషం ఏం కనపడదు.
 
 కాని కాళిదాసు మామూలు కవి కాదు గదా. కవి కుల గురువు. కవులకే గురువైనవాడు. కవికుల తిల కుడు. కవుల సమూహానికే అలంకారప్రాయమైన వాడు. అలాంటి కాళిదాసు మహాకవి ఇక్కడ దిలీపుని గురించి ఒక గొప్ప మాట అంటాడు. ఏమా మాట అంటే, దిలీపుడు రాజ్యాశ్రమ ముని అట. వశిష్ఠుడు మొదలైన మునులు అరణ్యంలో ఉంటూ అక్కడ ఆశ్ర మాలు నిర్మించుకొని తపస్సు చేసుకొంటున్నారు. దిలీ పుడు కూడా ఒక విధంగా ముని. వశిష్ఠుడు మొదలైన వారు అరణ్యంలో ఉంటే, దిలీపుడు రాజ్యంలో ఉన్నా డు. అంతవరకే తేడా. మిగతా విషయాల్లో సమానమే. వారు ఎలా అరణ్యంలో ఉండి ఇంద్రియాల్ని జయించి లోక క్షేమం కోసం తపస్సు చేస్తున్నారో, దిలీపుడు కూడా రాజ్యంలో రాజుగా ఉండి, లౌకిక వ్యవహారా ల్లో ఉన్నా, ఇంద్రియాల్ని జయించి, రాజ్యక్షేమం కోసం దీక్ష పట్టి పరిపాలన సాగిస్తున్నాడు. అతడికి రాజ్యాధి కారమే  ఆశ్రమం లాంటిది. పరిపాలననే తపస్సుగా భావించి చేస్తున్నాడు.
 ఇంద్రియ నిగ్రహం అలవర్చుకొనటానికి, దీక్షతో కర్తవ్యపాలన చేయటానికి ఉన్న ప్రదేశం, చేసే పని అడ్డురావని కాళిదాసు దిలీపుని ఉదాహరణగా చూపి స్తూ చెబుతున్నాడు. దిలీప మహారాజులాంటి వాడే జనక మహారాజు అని చదువుతాం. ఇద్దరూ రాజ్యా శ్రమంలో ఉన్న మునులు. ఇట్లాంటి దిలీప మహారాజు చరిత్రను ప్రాతిపదికగా తీసుకొని, కాళిదాసు రఘువం శంలోని మిగతా ఇరవై ఎనిమిది మంది రాజుల చరి త్రను వర్ణిస్తాడు. ఆ రఘువంశంలోని వాడే శ్రీరా ముడు రఘువంశ సుధాంబుధి చంద్రుడు.
 దీవి సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement