నిత్య జీవితంలో ఆధ్యాత్మికత గురించి చెబుతూ మెహెర్ బాబా ఇలా అన్నారు ఆధ్యాత్మికత అనేది భౌతిక జీవితానికి సంబంధం లేకుండా విడిగా ఉం డేది కాదు. అది నిత్యజీవితంలో భాగం. ఆధ్యా త్మికత అంటే ప్రాపంచిక కార్యకలాపాల నుంచి వైదొలిగి సన్యసించడం కాదు. బాహ్యంగా కాకుండా, మానసి కంగా భౌతిక వాంఛల్ని విడనాడటం ఆధ్యాత్మికత అనిపించుకుంటుంది.
తాము జీవితంలో అలసిపోయామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తారు కానీ, దాన్ని ఎలా పొందాలో తెలుసుకోరు. అయితే, జీవితం ఎంతో అందమైనది. ఆనందం అనుభవించటానికే జీవితం ఉన్నది. మనిషి జీవితాన్ని ఎలా అర్థం చేసుకొ న్నాడు? ఏ దృష్టితో చూస్తున్నాడు? జీవిత సమస్యల పట్ల అతడి అవగాహన ఏమిటి అనేది చాలా ముఖ్యం. అంతేకానీ నీ ముందున్న ప్రపంచం కాదు. ఇవాళ నీవు అలిసిపోయినట్లు, ఏదీ సరిగా లేనట్లూ, నీ చుట్టూరా ఉన్న ప్రపంచంలో ఏదీ అందంగా లేనట్లూ నీకు అనిపించవచ్చు. రేపు నీవు సంతోషంగా ఉంటే, అదే జీవితం, అదే ప్రపంచం, అవే వస్తువులు నీకు చాలా అందంగా కనిపించవచ్చు. అలా జరగటానికి కార ణం నీ మనస్సులో, నీ దృక్పథంలో వచ్చిన మార్పు.
జీవితాన్ని భారంగా కాకుండా, తేలిగ్గా తీసు కోవాలి. నీకు నీవు చెప్పుకో, ‘నేను ఆనందంగా ఉండటానికి, ఇతరు లను ఆనందంగా ఉంచటానికి ఉన్నాను’ అని. అలాగనక ఉంటే, క్రమక్రమంగా నీకు నీవు ఆనం దంగా ఉండగలుగుతావు. ఇతరులను ఆనందంగా ఉంచగలుగుతావు. ‘నేను అలసిపోయాను, నిరాశ చెందాను. దుఃఖంలో ఉన్నాను’ అని నీ మనస్సుకు నీవు సూచనలు ఇవ్వవద్దు. అలా గనక ఇస్తే, పరిస్థితి మరింత దిగజారుతుంది. అంతా బాగుంది, అందం గా ఉంది, నేను చాలా ఆనందంగా ఉంటాను’ అని ఎప్పుడూ అనుకో. అలా గనక ఉంటే నీలో ఉన్న భగవంతుడు నీకు ఆధ్యాత్మికంగా సాయం చేస్తాడు.
ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయి. బతుకు భయంకరంగా ఉందని ఏ కోశానా అనుకోవద్దు. అట్లాంటి ఆలోచనలు జీవితాన్ని నిజం గానే నరకప్రాయం చేస్తాయి. అలా కాకుండా జీవి తాన్ని ఆనందంగా జీవించాలి అని గనక నీవు నిర్ణ యించుకుంటే, అన్ని అవాంతరాలు, కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. నేను ఒంటరివాడిని, నాకు బాధ్యతలు ఉన్నవి, నా దగ్గర డబ్బులేదు... ఇట్లా అను కోవద్దు. లోకంలో ధనవంతులు ఎవరున్నారు? అం దరూ ఏదో రకంగా బీదవారే. కోటీశ్వరులు కూడా దరిద్రులే. ఎందుకంటే, వాళ్లకు స్వార్థం ఎక్కువ. తృప్తి లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చేతులు చాపుకుని ఉంటారు. వాళ్లలా కాకుండా నీవు సాటి మనిషిని ప్రేమించు. సాటిమనిషిని ప్రేమిస్తే భగవం తుడు నిన్ను ప్రేమిస్తాడు. భగవంతుని ప్రేమను పొందిన వానికి జీవితంలో ఏ లోటూ ఉండదు.. అంటారు మెహెర్ బాబా.
- దీవి సుబ్బారావు
ఆధ్యాత్మికత
Published Sat, Dec 26 2015 1:34 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
Advertisement