మైత్రేయ మేలి పలుకులు | sahityam maitreya words for successful life | Sakshi
Sakshi News home page

మైత్రేయ మేలి పలుకులు

Published Mon, Aug 26 2013 12:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM

మైత్రేయ మేలి పలుకులు

మైత్రేయ మేలి పలుకులు


‘జీవితాన్ని జీవించు, గడిపేయొద్దు’...
 ‘జీవించే జీవితాన్ని ప్రేమిస్తే, ప్రేమించే జీవితాన్ని జీవిస్తావు’....


 స్వామి మైత్రేయ ప్రేమ సంబంధమైన జీవితాన్ని, ఆనందమయ జీవితాన్ని జీవించడానికి మనస్సును ఎలా శుద్ధి చేసుకోవాలో బోధించే యోగి పుంగవులు. పలు మాధ్యమాల ద్వారా ధ్యానాన్ని ప్రచారం చేయడమే కాదు సఫలవంతమైన జీవితానికి అవసరమైన సూక్తులను కూడా ఆయన అందిస్తూ ఉంటారు. అలాంటి వాటన్నింటినీ సేకరించి ఆయన శిష్యురాలు స్వప్న మల్లిక్ వేసిన పుస్తకం ఇది. ‘స్వర్గం చావు తర్వాత వచ్చేది కాదు, ఈ క్షణంలో చూడగలిగే నీ అంతరాత్మ దర్శనమే’.... ‘చైతన్యంతో ఉంటే దాదాపు అన్ని రోగాలూ మాయమవుతాయి’ వంటి అనేక కాంతి కిరణాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. చీకట్లో ఉన్నవారికి ఇది వెలుగు ఇచ్చే దీపమే.
 మైత్రేయ మేలి పలుకులు; వెల: రూ. 65; ప్రతులకు: 09686488116
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement