బ్రాండింగ్ బుల్లోడు | young talented Kalahar reddy to be called as Branding bullodu | Sakshi
Sakshi News home page

బ్రాండింగ్ బుల్లోడు

Published Sat, Aug 16 2014 1:05 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బ్రాండింగ్ బుల్లోడు - Sakshi

బ్రాండింగ్ బుల్లోడు

ఫ్రెండ్స్‌తో షికార్లు.. సరదా కబుర్లు. కుదిరితే కప్పు కాఫీ.. లేదంటే ఎఫ్‌బీ.. సిటీ కుర్రాడంటే ఇంతే అనుకుంటారంతా. అయితే నలుగురిలో ఉంటూనే ఒక్కడిగా ఎదిగి.. ఆ నలుగురికీ సాయుం చేస్తున్నాడు నవతరం కుర్రాడు. ఈ కోవకు చెందినవాడే  ‘బ్రాండింగ్ బుల్లోడు’ కలహర్‌రెడ్డి..
 
 బాలీవుడ్ తారలు సిటీలో తళుక్కువునడం వెనుక వున ‘బ్రాండింగ్ బుల్లోడు’ కలహర్‌రెడ్డి పనితనం ఉంది. ‘చాక్లెట్ బాయ్‌గా పేరున్న ఈ 23 ఏళ్ల బుల్లోడు సిటీలో కన్నా.. బాలీవుడ్‌లోనే బాగా ఫేవుస్. బాలీవుడ్ చిత్రాలకు సరికొత్తగా బ్రాండింగ్ చేస్తున్నాడు. వుూడేళ్లలో మెగా బ్రాండింగ్ సంస్థగా ఎదిగి ‘చాక్లెట్ బాయ్ ప్రొడక్షన్స్’ అధినేతగా కొత్త అధ్యాయూనికి శ్రీకారం చుట్టాడు.
 
 కుర్రకారుతో మెగాస్టార్లు
 షారూక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, రణవీర్‌కపూర్, దీపిక, విద్యాబాలన్ వంటి బాలీవుడ్ స్టార్ల సినివూలకు సిటీలో కలహరే బ్రాండింగ్ చేస్తాడు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు వుూవీ ప్రమోషన్ కోసం సిటీకొస్తే ప్రెస్‌మీట్‌కే పరిమితవుయ్యేవారు. ఇప్పుడు కాలేజీలకు వెళ్తున్నారు. వూల్స్‌లో ప్రత్యక్షవువుతున్నారు. డ్యాన్స్‌లు చేస్తున్నారు.. ఫ్యాషన్ షోల్లో మెరిసిపోతున్నారు. ఈ కొత్త తరహా ఈవెంట్స్ క్రియేట్ చేసిన క్రెడిట్ కలహర్‌కే దక్కుతుంది.
 
 తొలి పెట్టుబడి రూ. 20వేలే
 ‘నాన్న బిజినెస్ మ్యాన్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివా. డిఫరెంట్‌గా బిజినెస్ చేయూలనుకున్నా. మొదట రూ.20 వేలతో ఓ చిన్న పార్టీ అరేంజ్ చేశా. దానికి వుంచి స్పందన వచ్చింది. రొటీన్‌కు భిన్నంగా సరికొత్త థీమ్‌తో పార్టీలు ఏర్పాటు చేస్తూ సాగిపోయూ’ అని తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చాడు కలహర్. బ్రాండింగ్‌తో పాటు కపుల్, డీజే పార్టీలు, టమాటినా ఫెస్టివల్, స్నో ఫాల్, స్మోక్, సన్ డౌనింగ్, ఫ్యాషన్ షోల వంటి  ఈవెంట్లెన్నో డిఫరెంట్‌గా నిర్వహిస్తున్నాడు కలహర్. వరల్డ్ క్లాస్ డీజేలను సిటీకి రప్పించి వుూ్యజిక్ మస్తీ చేస్తున్నాడు. అంతేనా నగరంలోని రెరుున్ పబ్, ఆక్వా వంటి పబ్‌ల రూపకర్త కూడా కలహరే.
 
 అప్‌సెట్ అరుుతే అంతే
 ‘నయూ పోకడలను రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించే హైదరాబాద్ సిటీలో ఇప్పటికీ అడుగడుగునా ట్రెడిషనల్ స్పిరిట్ కనిపిస్తుంటుంది. ఈ సిటీ గొప్పదనం అందరికీ తెలియుజెప్పాలనేది నా ఆకాంక్ష. అందుకే సాధ్యమైనంత వుంది బాలీవుడ్ స్టార్లను ఇక్కడికి రప్పించే ప్రయుత్నం చేస్తున్నా’ అని చెబుతాడు కలహర్. ‘బాలీవుడ్ తారలను తీసుకురావడం అంత ఈజీ కాదు. వారి కోసం చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయూలి.
 
 అన్ని వసతులూ దగ్గరుండి చూసుకోవాలి. ప్రోగ్రామ్ అప్‌సెట్ అరుుతే.. అంతే సంగతులు. కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది కూడా’ అని బిజినెస్‌లో రిస్కీ ఫ్యాక్ట్స్ వుుందుంచాడు కలహర్. బాస్ సినివూ ప్రమోషన్‌కు వచ్చినప్పుడు అక్షయ్‌కువూర్ అప్పటికప్పుడు చార్మినార్ చూస్తానన్నాడు. పోలీసుల అనువుతి తీసుకునే సరికి తల ప్రాణం తోకకు వచ్చింద’ని జ్ఞాపకాలు పంచుకున్నాడు. కలహర్ తన బిజినెస్‌తో 35 మందికి ఉపాధి కల్పించాడు. అంతేకాదు ఈవెంట్ల ద్వారా వచ్చిన మొత్తంలో కొంతభాగం సావూజిక సేవకు
 వినియోగిస్తుంటాడు.
 - హను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement