Young talent
-
యంగ్ టాలెంట్: బహుముఖ ప్రజ్ఞతో సత్తా చాటుతున్న చిచ్చర పిడుగులు
అవధాన సుధ పద్యాలు చదివే పిల్లలు ఈరోజుల్లో అరుదైపోయారు. అయితే హైదరాబాద్‌కు చెందిన సంకీర్త్ అలా కాదు. పద్యాలు చదవడమే కాదు అలవోకగా పద్యాలు అల్లుతూ ‘బాలావధాని’ అనిపించుకుంటున్నాడు...పదమూడు సంవత్సరాల వింజమూరి సంకీర్త్ తటవర్తి గురుకులంలో పద్యరచనలో శిక్షణ ΄÷ందుతూ ఎన్నో పద్యాలు రాశాడు. ‘క్షాత్రసరణి’ అనే శతక కార్యక్రమంలో మొదటిసారిగా తన పద్యాలు చదివి ‘భేష్’ అనిపించుకున్నాడు. ‘భీముడు జంపె రావణుని భీకర లీల మహోగ్ర తేజుడై’ అని ఇచ్చిన సమస్యకు బాలావధాని ‘క్షేమము గూర్చగా ధరకి శ్రీయుత రూపము నెత్తె భూతలిన్ / ధామముగాను వెల్గు వరదాయకుడై రణధీరయోగియై/ స్వామిగ లోక రక్షణకు సంతసమొంద రణాన రాముడే / భీముడు జంపె రావణుని భీకర లీల మహోగ్ర తేజుడై’ అని చక్కగా పూరించాడు. దత్తపది అంశంలో ‘కరి వరి మరి తరి‘ పదాలు ఇచ్చి అమ్మవారిని వర్ణించమని అడగగా...‘దేవి శ్రీకరి శాంకరి దివ్యవాణినీదు సేవను తరియించి విత్యముగను లోకమును గావ రిపులను రూపుమాపికావుమమ్మ ధరన్ మరి కరుణ జూపి’ అంటూ పూరించాడు. వర్ణన అంశంలో ఉయ్యాల సేవ వర్ణన అడుగగా ‘వెంకటాచలమని వేంకటేశుని గొల్చి, ఊయలూపుచుండ హాయిగాను, భక్తులకు వరముగ భవ్య స్వరూవమై, వెలసినట్టి దేవ వినయ నుతులు‘ అంటూ చక్కగా వర్ణించాడు. ఒకటవ పాదంలో మొదటి అక్షరం శ, 2వ పాదంలో 2వ అక్షరం మ, 3వ పాదంలో 11వ అక్షరం సా, 4వ పాదంలో 19వ అక్షరం వచ్చే విధంగా దుర్గాపూజను వర్ణించమని అడిగితే...‘శమియగు నీ స్వరూపము సుశక్తినొసంగగ దివ్య మాతవై / గమనము దెల్పుచున్ సుమతి కామితదాయిని సింహవాహిని/ సమత వహించుదేవతగ సారమునిచ్చుచు మమ్ముగావవే / మమతయె పొంగగా ధరణు మానితమూర్తి ముదంబు పాడెనే’ అంటూ పూరించి ధారతో కూడిన ధారణ చేసి అందరి మనసులను ఆకట్టుకున్నాడు.తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్కూచిపూడి నృత్య సంప్రదాయంలో తలపై మూడు కుండలు, హిప్ హోల రింగ్ వేసుకుని, కుండపై నిలబడి నృత్యం చేయడం ద్వారా ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది నిడదవోలుకు చెందిన ఆరు సంవత్సరాల చిన్నారి మద్దిరాల కేతనరెడ్డి.వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్పదిహేను సంవత్సరాల వయసులోనే బహుముఖ ప్రజ్ఞతో వివిధ రంగాలలో ఎన్నో విజయాలను సాధిస్తోంది అన్నమయ్య జిల్లా దేవరవాండ్లపల్లికి చెందిన కైవల్య రెడ్డి ‘వివిధ రంగాలలో బహుముఖప్రజ్ఞ చూపిన విద్యార్ధిని’గా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. కూచిపూడి నుంచి కరాటే వరకు ఎన్నో విద్యల్లో ప్రతిభ చాటుతోంది. (చదవండి: మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో..ఏకంగా డిజిటల్ స్టార్..) -
Harshitha: కామన్ మ్యాన్ ఫ్రెండ్..!
ఆలోచించాలేగానీ.. శతకోటి సమస్యలకు అనంత కోటి పరిష్కారాలు ఉంటాయి. మామయ్యను అనారోగ్యానికి గురి చేసిన సమస్యపై దృష్టి పెట్టిన హరిత ఆ సమస్యకు పరిష్కారం కనుక్కుంది. శాస్త్రప్రపంచంలో తొలి అడుగు వేసింది...పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన హర్షిత చిన్ననాటి నుంచి తెలివైన విద్యార్థి. జెడ్పీ హెచ్ఎస్ చందనాపూర్లో చదువుతుండేది. క్రమం తప్పకుండా బడికి వచ్చే హర్షిత ఒకసారి వరుసగా వారంరోజులు రాలేదు. ఆ తరువాత బడికి వచ్చిన హర్షితను సైన్స్ టీచర్‌తో పాటు క్లాస్ టీచర్‌గా ఉన్న సంపత్ కారణం అడిగారు.తన మామయ్య వెల్డింగ్ పనిచేస్తాడని, వెల్డింగ్ పొగ పీల్చి ఊపిరితిత్తులు జబ్బు పడ్డాయని, ఆయనకు సహాయంగా ఉండేందుకు స్కూలుకు రాలేదని చెప్పింది. ‘మామయ్య మరోసారి జబ్బు పడకుండా ఏదైనా చేయాలని ఉంది’ అని తన మనసులోని మాట చెప్పింది. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో హరిత ఒక హెల్మెట్ తయారుచేసింది. చిన్న ఫ్యాన్ అమర్చి రూపొందించిన ఈ హెల్మెట్ వెల్డింగ్ సమయంలో పొగను ముఖం వరకు చేరనివ్వదు. హరిత రూపొందించిన హెల్మెట్ చూసి సైన్స్ టీచర్ ఆశ్చర్యపోయారు. హరితను అభినందించారు.తొలుత ప్రోటోటైప్‌గా రూపొందించిన ఈ హెల్మెట్‌ను ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో మరింత మెరుగు పరిచింది. హెల్మెట్‌కు ఒక సెన్సార్ బిగించి, వెల్డింగ్ చేస్తున్న వ్యక్తి ముఖం పైకి పొగ రాగానే హెల్మెట్‌పై ఉన్న ఫ్యాన్ దానంతట అదే తిరిగేలా డిజైన్ చేసింది. సిమెంటు, ఇటుక, పిండిమర.... మొదలైన పరిశ్రమలలో పని చేసే కార్మికులు, నిరంతరం దుమ్ములో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా రక్షణ ఇస్తుంది. దీనికి ‘కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ హెల్మెట్’గా నామకరణం చేసింది. ఈ హెల్మెట్ జపాన్ సకురా ఇంటర్నేషనల్ సైన్స్ప్రోగ్రాం, ఇండియన్ ఇంటర్నేషన్ ఇన్నోవేషన్ప్రోగ్రాం, ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ప్రోగ్రామ్లకు ఎంపికైంది.స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్‌బాటిల్.కరోనా టైమ్‌లో స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్ బాటిల్‌ను తయారు చేసింది హర్షిత. ఈ బాటిల్‌ను మూడు అరలుగా విభజించారు. మొదటి అరలో శానిటైజర్, రెండో అరలో తాగునీరు, మూడో అరలో సబ్బు/స్నాక్స్ పెట్టుకునేలా ఈ బాటిల్‌ను రూపొందించింది. ప్రతీ అరగంటకు ఒకసారి నీరు తాగే విషయాన్ని మనకు రెడ్‌లైట్‌తో లేదా వైబ్రేషన్, సౌండ్ సదుపాయాల ద్వారా గుర్తు చేస్తుంటుంది. హర్షిత కరీంనగర్‌లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్’లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. – బాషబోయిన అనిల్ కుమార్, సాక్షి, కరీంనగర్ఇవి చదవండి: ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు! -
Mur Ghurar Duronto Goti: అవును.. గుర్రం ఎగిరింది.. కలా? నిజమా!
‘అవును... గుర్రం ఎగరావచ్చు’ అంటారు. ఈ గుర్రం మాత్రం ఎగరడమే కాదు... యంగ్ డైరెక్టర్ మహర్షి కశ్యప్‌ను కూర్చోబెట్టుకొని బెంగళూరు నుంచి జైపుర్ వరకు తిప్పింది. రేపు ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా తీసుకువెళ్లవచ్చు... ఆస్కార్ 2023 బరిలో ‘షార్ట్ ఫిల్మ్ ఫిక్షన్’ విభాగంలో మన దేశం నుంచి అస్సామీ షార్ట్ ఫిల్మ్ మర్ గౌరర్ డురొంటో గోటి (ది హార్స్ ఫ్రమ్ హెవెన్) ఎంపికైంది. 27 సంవత్సరాల మహర్షి తుహిన్ కశ్యప్ దీని దర్శకుడు. కథ విషయానికి వస్తే... ఒక పెద్దాయన ఎప్పుడూ పగటి కల కంటూ ఉంటాడు. నగరంలో జరిగే గుర్రపు పందేలలో తన గుర్రం కూడా ఉండాలి. ఆ గుర్రం ఎలాంటిదంటే, మెరుపు వేగంతో పరుగులు తీస్తుంది. ఎప్పుడు గుర్రపు పందేలు జరిగినా తానే విజేత. ‘మీ గుర్రానికి ఎంత బాగా శిక్షణ ఇచ్చారు’ అంటూ అందరూ తనను వేనోళ్లా పొగుడుతుంటారు. ‘ఇంతకీ నా గుర్రం ఏదీ?’ అని వెదుకుతాడు ఆ పెద్దాయన. కానీ ఆ గుర్రం ఊహాల్లో తప్ప వాస్తవప్రపంచంలో కనిపించదు. అక్కడ కనిపించేది తన గాడిద మాత్రమే! ‘కలా? నిజమా! అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ గురించి వింటూ, చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను ఆస్కార్ బరిలో నిలవడం అనేది గర్వంగా ఉంది’ అంటున్నాడు మహర్షి. కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయిన మహర్షి స్టూడెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తీశాడు. సర్రియలిజం, డార్క్ హ్యూమర్లతో కూడిన ఈ కథను చెప్పడానికి సంప్రదాయ కళ ‘ఒజపాలి’ని సమర్థవంతంగా వాడుకున్నాడు దర్శకుడు. ఆరువందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న అస్సామీ కళారూపం ‘ఒజపాలి’లో కళాకారులు ఆడుతూ, పాడుతూ, నవ్విస్తూ పురాణాలలో నుంచి కథలు చెబుతుంటారు. ‘ది హార్స్ ఫ్రమ్ హెవెన్’ను ఎక్కువ భాగం క్యాంపస్‌లో చిత్రీకరించారు. కొంత భాగం కోల్‌కతా శివారులలో చిత్రీకరించారు. ఈ చిత్రం కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్, జైపుర్ ఫిల్మ్‌ఫెస్టివల్, ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్, డీప్ ఫోకస్ స్టూడెంట్ ఫిల్మ్‌ఫెస్టివల్...మొదలైన ఎన్నో చిత్రోత్సవాలకు ఎంపికైంది. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్(బీఐఎస్ఎఫ్ఎఫ్)లో ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డ్ అందుకొని ఆస్కార్ బరిలోకి దిగబోతుంది. ఫీచర్ ఫిల్మ్స్‌లా కాకుండా ఒక షార్ట్‌ఫిల్మ్‌ను ఆస్కార్‌కు పంపాలంటే అది ఆస్కార్ – క్వాలిఫైయింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ గెలుచుకోవాలి. మన దేశంలో అలాంటి ఏకైక ఫిల్మ్ ఫెస్టివల్ బీఐఎస్ఎఫ్ఎఫ్. ‘చిత్ర రూపకల్పన అనేది ఎంత క్లిషమైన విషయమో అందులో దిగాక కాని తెలియదు. ప్రతిరోజూ ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. స్వర్గం నుంచి దిగి వచ్చిన గుర్రం మమ్మల్ని ఎన్నో నగరాలు తిప్పింది. భవిష్యత్‌లో ఎన్ని చోట్లకు తీసుకువెళుతుందో తెలియదు’ అంటున్నాడు మహర్షి. కల్లోల ప్రాంతంలో పుట్టి పెరిగిన మహర్షికి ఎనిమిదవ తరగతిలో డైరెక్టర్ కావాలనే కోరిక పుట్టింది. చాలామందిలో ఆతరువాత కాలంలో ఆ కోరిక ఆవిరైపోతుంది. కానీ మహర్షి విషయంలో మాత్రం అది ఇంకా బలపడింది. (క్లిక్: హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత) సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టిన రోజు తన కలకు రెక్కలు దొరికినట్లుగా సంతోషపడ్డాడు. మహర్షిలో ఉన్న ప్రశంసనీయమైన ప్రత్యేకత ఏమిటంటే.. నేల విడిచి సాము చేయాలనుకోవడం లేదు. తన నేల మీద నడయాడిన కథలనే చిత్రాల్లోకి తీసుకురావాలకుంటున్నాడు. ఉత్తర, దక్షిణ భారతాలతో పోల్చితే వెండి తెర మీద కనిపించిన ఈశాన్య భారత ప్రాంత కథలు తక్కువ. ఇప్పుడు ఆ లోటు మహర్షి కశ్యప్ రూపంలో తీరబోతుంది. ఆస్కార్ ఎంట్రీ అనేది ఆరంభం మాత్రమే! (క్లిక్: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్) ప్రాంతీయ చిత్రాలు రకరకాల కష్టాలు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. అస్సాం అనేది కొత్త కథలకు కేంద్రం కాబోతుంది. – మహర్షి -
Arya Dhayal: డిజిటల్ మ్యూజిక్ సెన్సేషన్
ఎన్ని రోజులు చీకట్లో కూర్చుంటావు? ఎన్ని రోజులు నీ ఒంటరి ప్రపంచంలో ఉంటావు? కదలాలి... కదనరంగంలోకి దూకాలి కాలంతో పోటీ పడాలి. ‘కాలం మారి... కోలం మారి’ అంటోంది ఆర్యా దయాళ్. దేశీయ సంగీతానికి వెస్ట్రన్ ఫ్లేవర్ జోడించి యుకెలేలితో అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్యా. తన పాటకు పునాది సామాజిక స్పృహ అని చెబుతుంది... తాను పాడిన పాటను బిగ్‌బి అమితాబ్‌కు పంపించాలనుకుంది ఆర్యా దయాళ్. అంతే..అప్పటికప్పుడు తన గదిలో కూర్చొని ఎడ్ షీరన్ పాపులర్ సాంగ్ ‘షెడ్ ఆఫ్ యూ’ పాడి సెల్ఫోన్లో రికార్డ్ చేసి పంపించింది. కోవిడ్ చికిత్సలో భాగంగా ఆ సమయంలో ‘బిగ్ బి’ హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి అటు నుంచి స్పందన వస్తుందని అనుకోలేదు ఆర్యా. కాని ఊహించని విధంగా పెద్దాయన నుంచి పెద్ద స్పందన వచ్చింది. ‘మీరేవరో నాకు తెలియదు. కాని నాకు బాగా తెలుసు... మీలో గొప్ప ప్రతిభ ఉందని. కర్నాటక, వెస్ట్రన్ మ్యూజిక్‌ను మిక్స్ చేయడం సులువు కాదు. కాని ఆ పని మీరు చాలా సులువుగా చేశారు. మిక్సింగ్‌లో వాటి సహజత్వం మిస్ కాకుండా చూశారు. ఈరోజు మీ పాట వినడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది’ అని ట్విట్టర్లో ఆశీర్వదించారు బిగ్ బి. హరిహరన్లాంటి ప్రసిద్ధ గాయకుల నుంచి కూడా ఆర్యాకు ప్రశంసలు లభించాయి. ‘పెద్దల ప్రశంసలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి’ అని సంబరపడిపోతుంది ఆర్యా. కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందిన ఆర్యా దయాళ్ 2016లో రాసిన ఒక కవిత సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తరువాత సాహిత్యంలోనే కాదు సంగీతంలోనూ తన టాలెంట్ చాటుకుంది ఆర్యా. ‘కాలం మారి–కోలమ్ మారి–ఎన్జన్గళుమ్ అంగ్ మారి’ (కాలం మారింది. చూసే దృష్టికోణం మారింది. కాబట్టి మనం కూడా మారాలి) పాటతో డిజిటల్ మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్యాకు 140,000 ఫాలోవర్స్ ఉన్నారు. తన పాటలను ఎప్పటికప్పుడూ పోస్ట్ చేస్తుంటుంది. ఆమె లెటెస్ట్ రిలీజ్ ‘అంగనే వేనమ్’ ట్రెండింగ్ అయింది. మాస్, మసాల పాటలు కాకుండా స్త్రీలను చైతన్యపరిచే పాటలు, లింగవివక్షతను ఖండించే పాటలు పాడడం అంటే ఆర్యాకు ఎంతో ఇష్టం. ఇక తనకు ఇష్టమైన సంగీతవాయిద్యం యుకెలేలి. పచ్చటి ప్రకృతి ఒడిలో, నిశ్శబ్దం దట్టంగా ఆవరించిన ఏకాంతదేశంలో యుకెలేలి స్వరాలు ఆర్యాను కొత్త లోకాల్లోకి తీసుకువెళతాయి. ‘రా వాయిస్’ ఆమె ప్రత్యేకత. కొందరైతే ‘యుకెలేలిలాగే ఆమె స్వరం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్’ అని ప్రశంసిస్తుంటారు! -
బ్రాండింగ్ బుల్లోడు
ఫ్రెండ్స్‌తో షికార్లు.. సరదా కబుర్లు. కుదిరితే కప్పు కాఫీ.. లేదంటే ఎఫ్బీ.. సిటీ కుర్రాడంటే ఇంతే అనుకుంటారంతా. అయితే నలుగురిలో ఉంటూనే ఒక్కడిగా ఎదిగి.. ఆ నలుగురికీ సాయుం చేస్తున్నాడు నవతరం కుర్రాడు. ఈ కోవకు చెందినవాడే ‘బ్రాండింగ్ బుల్లోడు’ కలహర్‌రెడ్డి.. బాలీవుడ్ తారలు సిటీలో తళుక్కువునడం వెనుక వున ‘బ్రాండింగ్ బుల్లోడు’ కలహర్‌రెడ్డి పనితనం ఉంది. ‘చాక్లెట్ బాయ్‌గా పేరున్న ఈ 23 ఏళ్ల బుల్లోడు సిటీలో కన్నా.. బాలీవుడ్లోనే బాగా ఫేవుస్. బాలీవుడ్ చిత్రాలకు సరికొత్తగా బ్రాండింగ్ చేస్తున్నాడు. వుూడేళ్లలో మెగా బ్రాండింగ్ సంస్థగా ఎదిగి ‘చాక్లెట్ బాయ్ ప్రొడక్షన్స్’ అధినేతగా కొత్త అధ్యాయూనికి శ్రీకారం చుట్టాడు. కుర్రకారుతో మెగాస్టార్లు షారూక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, రణవీర్‌కపూర్, దీపిక, విద్యాబాలన్ వంటి బాలీవుడ్ స్టార్ల సినివూలకు సిటీలో కలహరే బ్రాండింగ్ చేస్తాడు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్లు వుూవీ ప్రమోషన్ కోసం సిటీకొస్తే ప్రెస్‌మీట్‌కే పరిమితవుయ్యేవారు. ఇప్పుడు కాలేజీలకు వెళ్తున్నారు. వూల్స్లో ప్రత్యక్షవువుతున్నారు. డ్యాన్స్‌లు చేస్తున్నారు.. ఫ్యాషన్ షోల్లో మెరిసిపోతున్నారు. ఈ కొత్త తరహా ఈవెంట్స్ క్రియేట్ చేసిన క్రెడిట్ కలహర్కే దక్కుతుంది. తొలి పెట్టుబడి రూ. 20వేలే ‘నాన్న బిజినెస్ మ్యాన్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివా. డిఫరెంట్‌గా బిజినెస్ చేయూలనుకున్నా. మొదట రూ.20 వేలతో ఓ చిన్న పార్టీ అరేంజ్ చేశా. దానికి వుంచి స్పందన వచ్చింది. రొటీన్‌కు భిన్నంగా సరికొత్త థీమ్‌తో పార్టీలు ఏర్పాటు చేస్తూ సాగిపోయూ’ అని తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చాడు కలహర్. బ్రాండింగ్‌తో పాటు కపుల్, డీజే పార్టీలు, టమాటినా ఫెస్టివల్, స్నో ఫాల్, స్మోక్, సన్ డౌనింగ్, ఫ్యాషన్ షోల వంటి ఈవెంట్లెన్నో డిఫరెంట్‌గా నిర్వహిస్తున్నాడు కలహర్. వరల్డ్ క్లాస్ డీజేలను సిటీకి రప్పించి వుూ్యజిక్ మస్తీ చేస్తున్నాడు. అంతేనా నగరంలోని రెరుున్ పబ్, ఆక్వా వంటి పబ్‌ల రూపకర్త కూడా కలహరే. అప్సెట్ అరుుతే అంతే ‘నయూ పోకడలను రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించే హైదరాబాద్ సిటీలో ఇప్పటికీ అడుగడుగునా ట్రెడిషనల్ స్పిరిట్ కనిపిస్తుంటుంది. ఈ సిటీ గొప్పదనం అందరికీ తెలియుజెప్పాలనేది నా ఆకాంక్ష. అందుకే సాధ్యమైనంత వుంది బాలీవుడ్ స్టార్లను ఇక్కడికి రప్పించే ప్రయుత్నం చేస్తున్నా’ అని చెబుతాడు కలహర్. ‘బాలీవుడ్ తారలను తీసుకురావడం అంత ఈజీ కాదు. వారి కోసం చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయూలి. అన్ని వసతులూ దగ్గరుండి చూసుకోవాలి. ప్రోగ్రామ్ అప్సెట్ అరుుతే.. అంతే సంగతులు. కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది కూడా’ అని బిజినెస్‌లో రిస్కీ ఫ్యాక్ట్స్ వుుందుంచాడు కలహర్. బాస్ సినివూ ప్రమోషన్‌కు వచ్చినప్పుడు అక్షయ్కువూర్ అప్పటికప్పుడు చార్మినార్ చూస్తానన్నాడు. పోలీసుల అనువుతి తీసుకునే సరికి తల ప్రాణం తోకకు వచ్చింద’ని జ్ఞాపకాలు పంచుకున్నాడు. కలహర్ తన బిజినెస్‌తో 35 మందికి ఉపాధి కల్పించాడు. అంతేకాదు ఈవెంట్ల ద్వారా వచ్చిన మొత్తంలో కొంతభాగం సావూజిక సేవకు వినియోగిస్తుంటాడు. - హను -
ఆడపిల్లల రక్షణలో ఆప్తమిత్రులు
యువ ప్రతిభ ఆడపిల్లలను ఏడిపించే యువకుల్ని చూశాం. ప్రేమ అంటూ వెంటపడే కుర్రాళ్లని చూశాం. ర్యాగింగ్ అంటూ అల్లరి పెట్టే అబ్బాయిల్నీ చూశాం. కానీ పృథ్వీరాజ్ రామ్‌రాఖ్యానీ అలాంటివాడు కాదు. హైదరాబాద్‌లోని ‘ఐసీఎఫ్ఏఐ’ విద్యార్థి అయిన ఈ పద్దెనిమిదేళ్ల కుర్రాడు... ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన చెందాడు. వారి కోసం తనవంతుగా ఏదైనా చేయాలని ఆరాటపడ్డాడు. తన స్నేహితుడు అక్షయ్ రేతాతాతో కలిసి మహిళలకు మేలు చేసే ఓ చక్కని ఆవిష్కరణకు ఊపిరి పోశాడు. నిర్భయ ఉదంతం యావత్ దేశాన్నీ కుదిపేసింది. ఆ ఉదంతం పృథ్వీని కూడా కదిలించింది. ఆ తరువాత వరుసగా జరిగిన కొన్ని అత్యాచార ఉదంతాలు కూడా అతడి మనసును చలింపజేశాయి. సంఘటన జరిగిన ప్రతిసారీ అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటివి జరగడానికి వీల్లేదు అంటున్నారు. కానీ అలా జరగకుండా ఉండేందుకు మాత్రం ఎవరూ ఏమీ చేయడం లేదు. అది అతడిని ఎంతో బాధించింది. క్యాండిల్స్ వెలిగించడం వల్లనో, వీధుల్లో చేరి నినాదాలు చేయడం వల్లనో ఏదైనా ఉపయోగం ఉందా అని ఆలోచించాడు. తమ వంతుగా స్త్రీల సంరక్షణ కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. అలా అతడి వేదనలోంచి, తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి చేసిన మేథో మథనంలోంచి పుట్టుకొచ్చిందే... నాగా చిల్లీస్ పెప్పర్ స్ప్రే. ఇప్పటికే మార్కెట్లో చాలా పెప్పర్ స్ప్రేలు ఉన్నాయి. కానీ వాటి ఖరీదు కాస్తంత ఎక్కువే. అందువల్లనే చాలామంది మహిళలు వాటిని కొనడం లేదనే విషయాన్ని గుర్తించారు ఈ స్నేహితులిద్దరూ. అందుకే తామే ఓ పెప్పర్ స్ప్రేని తయారుచేసి, తక్కువ రేటుకే మహిళలకు అందించాలనుకున్నారు. తమ పాకెట్‌మనీని పోగుచేస్తే పదకొండు వేలు అయ్యింది. ఫ్రెండ్సందరినీ అడిగి మరికొంత సొమ్ము కూడబెట్టారు. నాగాల్యాండ్‌లో దొరికే నాగా చిల్లీస్‌ని (ఇవి ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలు) ఉపయోగించి శక్తిమంతమైన పెప్పర్ స్ప్రేని తయారుచేశారు. కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లి తమ స్ప్రే గురించి వివరించారు. దాన్ని దగ్గర ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలిపారు. మార్కెట్లో ఐదు వందలు పలికే స్ప్రేని 199 రూపాయలకే అమ్మడం మొదలుపెట్టారు. వాళ్లు ప్రతి స్ప్రేమీద వేసుకున్న లాభం... కేవలం 50 రూపాయలు. అయితే ఈ లాభాన్ని కూడా తమకోసం వాడుకోవడం లేదు. పేద మహిళలకు అమ్మే స్ప్రేలలో ఈ మొత్తాన్ని తగ్గిస్తున్నారు. చాలామందికి వీరు కేవలం యాభై రూపాయలకే స్ప్రేను అమ్ముతున్నారు. ఇప్పటికి ఇలా ఓ రెండు వేల క్యాన్ల స్ప్రేలను అమ్మారు. ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది అని అడిగితే... ‘‘జరిగిన తరువాత బాధపడితే ఉపయోగం ఏముంది, అలాంటివి జరక్కుండా ఉండేందుకు ఏం చేయాలా అని ఆలోచించాం, అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. మా ఆలోచన మంచి ఫలితాన్నే ఇచ్చింది’’ అంటాడు పృథ్వీ. అది నిజం. ‘సమాజం మారాలి’, ‘దురాగతాలు ఆగాలి’ అంటూ నినాదాలు చేస్తే ఫలితం ఉండదు. ఎవరు వచ్చి ఈ దుస్థితిని మారుస్తారా అని ఎదురుచూడటం వల్ల ఉపయోగం ఉండదు. మార్పును మనస్ఫూర్తిగా కోరుకుంటే మొదటి అడుగు మనమే వేయాలి. ఆ విషయాన్ని ఈ ఇద్దరూ నిరూపించారు!