ఎక్కడైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే ధర్నాలు, గొడవలు చేయకుండా చదువుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అభ్యర్థులు మాత్రం రోడ్డెక్కుతున్నారు. కారణమేమంటే రెండే ళ్లపాటు ఊరించి, ఊరిస్తూ ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ఏ జిల్లా లోనూ నిరుద్యోగులను సంతోషపరచలేదు. సంవత్సరాలుగా కన్నవారికి దూరంగా ఉంటూ ఉన్న డబ్బును కాస్త కోచింగ్ సెంటర్లకు కట్టి పస్తులుండి చదివితే దరఖాస్తు కూడా చేసుకో వడానికి అవకాశం లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. రెండుసార్లు టెట్ నిర్వహించి, తీరిగ్గా సింగిల్ డిజిట్ పోస్టులు ఇచ్చారు. కానీ, పోస్టు ఉంటే కదా దరఖాస్తు చేసుకోవడానికి? డీఎస్సీ నోటిఫికేషన్ 7,729 పోస్టులతో విడుదల చేశారు. పి.జి.టి నోటిఫికేషన్‌లో లాంగ్వేజెస్‌లలో నాలుగు జోన్‌లలో తెలుగుకు ఒక్క పోస్ట్ కూడా కేటాయించలేదు. జోన్ నాలుగులో పి.జి.టి. పోస్టును చూస్తే నోటిఫికేషన్‌లో మొత్తం 254 పోస్టులు చూపించారు.
అందులో మోడల్ స్కూల్‌లో 177, బీసీ Ðð ల్ఫేర్‌లో 77 పోస్టులు ఉన్నాయి. ఐతే 177 పోస్టులలో లాంగ్వేజెస్ ఒక ఇంగ్లిష్‌లో 29 పోస్టులు చూపించి మిగతావి ఖాళీగా చూపిం చారు. నాన్ లాంగ్వేజెస్‌లలో 67 పోస్టులు చూపించారు. కలిపితే 96 పోస్టులు. 177లో 96 పోస్టులు తీసివేస్తే 81 పోస్టులు మిగిలి నవి చూపించాలి. ఈ పోస్టులు ఏమయ్యాయో విద్యాశాఖ చెప్పాలని నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందనే ఆవే దన నిరుద్యోగుల్లో రాన్రానూ తీవ్రమవుతోంది. పదేళ్లుగా జూని యర్ కళాశాల లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్స్, టైంస్కేల్ అంటూ నిరుద్యోగు లను నిరాశకు గురి చేసి అర్హతలు లేని వారికి ఉద్యోగాలిచ్చారని ఆవేదనలో ఉన్నారు. అందుకే ఈ రోజు రోడ్డెక్కారు. రేపు ఓటు అనే ఆయుధంతో మీకు బదులివ్వబోతున్నారు.
వెంకట నరేంద్రప్రసాద్, పరిశోధక విద్యార్థి,
ఎస్వీయూ‘ 91775 09623
ఈ డీఎస్సీ ఎవరికోసం?
Published Wed, Nov 7 2018 12:39 AM | Last Updated on Wed, Nov 7 2018 12:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment