జూలై 23న సీటెట్‌ ఉండదు | Ctet is not Conduct in July 23rd says Kadiyam Sri Hari | Sakshi
Sakshi News home page

జూలై 23న సీటెట్‌ ఉండదు

Published Fri, Jun 9 2017 1:50 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

జూలై 23న సీటెట్‌ ఉండదు

జూలై 23న సీటెట్‌ ఉండదు

► తెలంగాణ టెట్‌ మాత్రమే ఉంటుంది: కడియం

హైదరాబాద్‌: వచ్చే నెల 23న సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (సీటెట్‌) నిర్వహించనున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. జూలై 23న తెలంగాణ టెట్‌ మాత్రమే ఉంటుందన్నారు. అదేరోజు సీటెట్‌ ఉందంటూ సాగుతున్న ప్రచారాన్ని నిరుద్యోగులు నమ్మవద్దని, అదంతా అబద్ధమని పేర్కొన్నారు.

సెంట్రల్‌ టెట్‌ డైరెక్టర్‌ ప్రసాదరావు ఈ విషయాన్ని ధ్రువీకరించారని కడియం వెల్లడించారు. వచ్చే నెల 23వ తేదీన సీటెట్‌ లేదంటూ పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ టెట్‌ నిర్వహించనున్న రోజే సీటెట్‌ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వారిపై చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ కిషన్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement