అరుంధతీ భట్టాచార్య పదవి పొడిగింపు
Published Sat, Oct 1 2016 4:23 PM | Last Updated on Tue, Aug 28 2018 8:04 PM
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య పదవీ కాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఆమె మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్30తో ముగియడంతో, మరో ఏడాదిపాటు ఆమెనే ఎస్బీఐ చైర్పర్సన్గా కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. భారతీయ మహిళా బ్యాంకుతోపాటు ఐదు అనుబంధ బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతున్నందున భట్టాచార్యను కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అంతకు మునుపే అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బ్యాంకు బోర్డు బ్యూరో నుంచి ఈ విషయమై అభిప్రాయాలను సైతం స్వీకరించింది. చివరకు ఆమె పదవిని పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.అక్టోబర్ చివరి నుంచి విలీన ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్టు ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే.
Advertisement