సనా: గల్ఫ్ దేశం యెమెన్‌లో ప్రభుత్వ దళాలు తిరుగుబాటు దారులపై చేపట్టిన దాడుల్లో 38 మంది చనిపోయారు. రేవు నగరం మోచాపై పట్టుకోసం ప్రభుత్వ బలగాలు జరిపిన దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన 38 మంది మృతి చెందినట్లు సమాచారం. యెమెన్‌లోని అబెద్ రబ్బో హన్సూర్ హదీ ప్రభుత్వానికి, షియా వర్గానికి చెందిన హౌతి తీవ్రవాదులకు మధ్య రెండేళ్లుగా పోరు సాగుతోంది. దేశ రాజధాని సనా సహా కొన్ని ప్రాంతాలు హౌతి తిరుగుబాటు దారుల హస్తగతమయ్యాయి. వాటిని తిరిగి చేజిక్కించుకునేందుకు పొరుగునే ఉన్న సౌదీ అరేబియా సాయంతో యెమెన్ ప్రభుత్వం పోరాటం సాగిస్తోంది. కాగా, తాజాగా జరిగిన మోచా ఘటనపై ప్రభుత్వ వర్గాలు అధికారికంగా స్పందించటం లేదు.