పోలీస్ డ్రెస్ వేసుకొని బుక్ అయిన కలెక్టర్
ఎర్నాకులం(కేరళ): సరాదా కోసం చేసిన పని ఎర్నాకులం జిల్లా కలెక్టర్ ఎంజీ రాజమనికంకు తలనొప్పిగా మారింది. కొన్ని రోజుల క్రితం తన భార్య, ఐపీఎస్ అధికారిణి అయిన నిషాంతిని (ప్రస్తుతం త్రిసూర్ జిల్లా కమిషనర్) పోలీస్ డ్రెస్ని వేసుకుని ఫొటో దిగారు. ఆ ఫొటోను కలెక్టర్ తన ఫేస్ బుక్లో ప్రొఫైల్ పిక్గా పెట్టారు.
తర్వాత ఆ ఫోటోనే ప్రముఖ వార్తపత్రికల్లో కూడా ప్రచురించారు. దీన్ని గమనించిన కొచ్చికి చెందిన ఒక వ్యక్తి కలెక్టర్ పోలీస్ అధికారిని డ్రెస్ని దుర్వినియోగం చేశారని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర హోం కార్యదర్శి నళిని నెట్టో ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. కేరళ పోలీసు చట్టాన్ని అతిక్రమించారని సదరు కలెక్టర్కి కాషన్ నోటీస్ కూడా పంపారు.