‘పూజారిని హత్య చేసింది మేమే’
Published Tue, Feb 23 2016 8:57 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
ఢాకా: భారత, బంగ్లాదేశ్ సరిహద్దులోని హిందూ ఆలయంలో జరిగిన పూజారి హత్యకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. మత సంబంధిత దాడులకు ఇది ప్రారంభం మాత్రమేనని పేర్కొంది. అమెరికాకు చెందిన ప్రైవేటు ఇంటలిజెన్స్ గ్రూప్ ఐసిస్ ప్రకటనను అరబిక్‌లో ప్రచురించింది. ఆదివారం ఉత్తరపంచఘడ్ జిల్లాలోని సోనాపేట గ్రామంలోని సంత్‌గౌర్హియా ఆలయంలోని పనిచేసే పూజారి జ్ఞానేశ్వర్ రాయ్(50)ని దుండగులు గొంతుకోసి హతమార్చగా.. మరో ఇద్దరు భక్తులు గాయపడిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement