కళాకారుడిగా గర్వపడుతున్నా | Pinnamaneni foundation award for Hariprasad Chaurasia | Sakshi
Sakshi News home page

కళాకారుడిగా గర్వపడుతున్నా

Published Thu, Dec 17 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

కళాకారుడిగా గర్వపడుతున్నా

కళాకారుడిగా గర్వపడుతున్నా

పండిట్ హరిప్రసాద్ చౌరాసియా
విజయవాడ (భవానీపురం):
ముంబై నుంచి పిలిపించి అవార్డును ప్రదానం చేసినందుకు ఒక కళాకారుడిగా గర్వపడుతున్నానని వేణు, వీణాగాన విద్వాంసుడు, పద్మవిభూషణ్ పండి ట్ హరిప్రసాద్ చౌరాసియా అన్నారు. డాక్టర్ పిన్నమనేని-సీతాదేవి ఫౌండేషన్ 25వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం మొగల్రాజపురంలో సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం జరిగింది.  కార్యక్రమంలో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, జర్నలిస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్ హిందోల్ సేన్‌గుప్తాలకు అవార్డులను ప్రదానం చేశారు. గ్రామీణ ప్రగతి పురస్కారాన్ని అనంతపురం జిల్లా నార్సింపల్లికి చెందిన ముట్లూరి నరసింహప్పకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ చౌరాసియా మాట్లాడుతూ క్లాసికల్ మ్యూజిక్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నా, ఇటువంటి సంస్థల ద్వారా అందుకునే అవార్డులు మధురానుభూతుల్ని మిగులుస్తాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement