తెలంగాణలో నాలుగు కొత్త కమిషనరేట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లు, బీసీ కమిషన్ ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధిపేట, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ లలో కొత్త కమిషనరేట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందుకు వీలుగా కొత్త ఆర్డినెన్స్ ను విడుదల చేసింది.
దసరా పండగ రోజున రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్న విషయం తెలిసిందే. కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కొరత లేకుండా చూసేందుకు భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.