- 84 కొత్త ఇంగ్లిష్
మీడియం స్కూళ్లలో భర్తీకి చర్యలు
- ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది
- జూన్ 12లోగా నియామకాలు
- 504 సీఆర్‌టీ పోస్టులు మహిళలకే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) నియామకాలకు సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) చర్యలు చేపట్టింది. ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది చొప్పున మొత్తం 1,260 పోస్టులను భర్తీ చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే జూన్ 12 నుంచి ప్రారంభించనున్న ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో మొదట 6, 7 తరగతులను మాత్రమే ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఒక్కో స్కూల్లో ఆరుగురు కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్లు (సీఆర్‌టీ), 1 స్పెషల్ ఆఫీసర్, 1 పీఈటీ, 1 అకౌంటెంట్, ఇద్దరు వంట మనుషులు, 1 స్కావెంజర్, ఇద్దరు నైట్ వాచ్‌మన్‌లు, 1 అటెండర్ మొత్తంగా 15 మందిని ఒక్కో స్కూల్లో నియమించను న్నారు. సీఆర్‌టీలు, స్పెషల్ ఆఫీసర్ ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారై ఉండాలి.
సీఆర్‌టీలకు నెలకు రూ.15 వేలు, స్పెషల్ ఆఫీసర్‌కు రూ.20 వేలు, పీఈటీ, అకౌంటెం ట్‌కు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లిస్తారు. మొత్తం 504 సీఆర్‌టీ పోస్టులను మహిళల తోనే భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష ద్వారా వీరిని ఎంపిక చేస్తారు. జిల్లాల్లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. రాత పరీక్షలు, నియామకాలను పాఠశాలలు ప్రారంభించే రోజు(జూన్ 12) కంటే ముందే పూర్తి చేయాలని ఎస్‌ఎస్‌ఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్‌రావు డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. నియామకాల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఇచ్చారు. సీఆర్‌టీ పోస్టుల్లో మహిళలనే నియమిస్తారు. స్థానిక జిల్లాకు చెందిన వారినే టీచర్లుగా నియమిస్తారు. 11 నెలల కాంట్రాక్టు లేదా పాఠశాలలకు చివరి దినం వరకు ఏది ముందు అయితే దాన్ని పరిగణనలోకి తీసుకొని కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపడతారు. నియమితులైన వారు షిఫ్ట్ పద్ధతిలో రాత్రి వేళల్లోనూ పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త కేజీబీవీల్లో మొదట 34 స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తారు. ఒక్కో దానికి రూ.2.7 కోట్లు వెచ్చిస్తారు.
జూన్ 12న ప్రారంభించబోయే కేజీబీవీ మండలాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ (రూరల్), మవొల, ఇంద్రవెల్లి, గడిగూడ, మంచిర్యాల: బీమారం, నాన్‌పూర్, హజీపూర్, కన్నెపల్లి, నిర్మల్: నిర్మల్ (అర్బన్), సోన్, నర్సాపూర్, పెద్దూర్, దస్తూరాబాద్, కొమ్రంభీం: లింగాపూర్, పెంచికల్‌పేట, చింతల మానేపల్లి, రాజన్న (సిరిసిల్ల): తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగి, నిజామాబాద్ : ముప్కాల్, ముగ్బాల్, ఇందల్‌వాయి, మదర్నా, రుద్రూర్, ఎర్రగట్ల, కామారెడ్డి: రాజంపేట, బీబీపేట, వరంగల్ (అర్బన్): ఐనవోలు, వేలేరు, జయశంకర్ భూపాల్‌పల్లి : టేకుమట్ల, పలిమెల, కన్నాయిగూడెం, జనగాం: తరిగొప్పుల, చిల్పూర్, మహబూబాబాద్: గంగారం, చిన్నగూడూరు, పెద్దవంగర, ఖమ్మం: రఘునాథపాలెం, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం, బూర్గంపాడు, అల్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కరకగూడెం,
సిద్దిపేట: కొండపాక, కొమురవెల్లి, మర్కూక్, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ (రూరల్), రాజాపూర్, మరికల్, వనపర్తి: అమరచింత, మదనాపూర్, రేవల్లి, చిన్నాంబావి, శ్రీరంగపూర్, నాగర్‌కర్నూల్: పెంట్లవెల్లి, పదిర, సిద్ధాపూర్, ఊరకొండ, చరకొండ, జోగుళాంబ గద్వాల: నాందిన్నె, రాజోలి, కృష్ణా, ఉండవెల్లి,
నల్లగొండ: అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి, తిరుమల్‌గిరి(సాగర్), కొండమల్లెపల్లి, నెరేడుగొమ్ము, సూర్యాపేట: నాగారం, మద్దిరాల, పాలకీడు, చింతలపాలెం, యాదాద్రి: అడ్డగూడూరు, వికారాబాద్: కోట్‌పల్లి, రంగారెడ్డి: చౌదరిగూడెం, కడ్తాల్, పెద్దపల్లి: అంతర్గాం, పాలకుర్తి, రత్నాపూర్, కరీంనగర్: ఇల్లంతకుంట