హైదరాబాద్ : హుజీ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో నలుగురు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ పాస్ పోర్ట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురికి హుజీ తీవ్రవాద సంస్థతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి నకిలీ పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే వారితో పాటు మరికొంతమంది సానుభూతిపరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్కు చెందినవారిగా గుర్తించారు. వీరిలో పాకిస్థాన్కు చెందిన మహ్మద్ నజీర్ రెండు నెలలుగా హైదరాబాద్లో మకాం వేసినట్లు సమాచారం. పోలీసుల అదుపులో మొత్తం 15మంది సానుభూతిపరులు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా పాతబస్తీ చాంద్రాయణగుట్ట బాబానగర్లో రెండు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్న ఈ నలుగురిని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. కాగా వీరి అరెస్ట్ను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రదాడుల దాడి జరగవచ్చని, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హుజీ ఉగ్రవాదులు హైదరాబాద్లో అరెస్ట్ కావటం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్లో హుజీ తీవ్రవాదులు!
Published Fri, Aug 14 2015 12:30 PM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM
Advertisement
Advertisement