బనశంకరి: బెంగళూరులోని బిళిశివాలే వద్ద మాదకద‍్రవ్యాలు విక్రయిస్తున్న ఓ నైజీరియా దేశస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైకేల్ ఇయామ్ అనే యువకుడు స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొంతకాలంగా ఉంటున్నాడు. ఖరీదైన కార్లలో తిరుగుతూ యువతతో పరిచయాలు పెంచుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నాడు.
ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూ.6 లక్షల విలువైన కొకైన్, 14 సెల్‌ఫోన్లు, రెండు పాస్‌పోర్టులు, ఒక కారు, 3 హార్డ్‌డిస్క్ లు, ఒక ఐ ప్యాడ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కారులో సంచరిస్తూ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని, ఇతనిపై కొత్తనూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
నైజీరియన్ అరెస్ట్.. డ్రగ్స్ స్వాధీనం
Published Wed, May 31 2017 7:55 PM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM
Advertisement
Advertisement