స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కుని చిన్నారి మృతి | 5 year old girl killed after crushed in school lift | Sakshi
Sakshi News home page

స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కుని చిన్నారి మృతి

Nov 17 2015 10:06 AM | Updated on Sep 3 2017 12:37 PM

స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కుని చిన్నారి మృతి

స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కుని చిన్నారి మృతి

హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్: హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి జెహాన అక్కడికక్కడే మరణించింది. లిఫ్ట్లోని గ్యాప్లో చిక్కుకోవడంతో చిన్నారి తల తెగిపోయింది.


మంగళవారం ఉదయం స్కూల్కు వెళ్లిన జెహాన .. తోటి విద్యార్థులతో కలసి పైఅంతస్తులోని తరగతి గదికి లిఫ్ట్లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లిఫ్ట్ గ్యాప్లో ఇరుక్కోవడంతో జెహాన విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి శరీరం లిఫ్ట్లో ఇరుక్కుపోయింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు.  ఇంటి నుంచి స్కూల్కు వెళ్లిన పాప అంతలోనే మరణించిదన్న వార్త తెలియడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement