dilsukhnaganar school
-
'బాధ్యులపై చర్యలు తీసుకుంటాం'
హైదరాబాద్: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి జెహాన మరణించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ రవీందర్ చెప్పారు. స్కూల్ ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన జహాన .. తోటి విద్యార్థులతో కలసి పై అంతస్తులోని తరగతి గదికి లిఫ్ట్‌లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
స్కూల్ లిఫ్ట్‌లో ఇరుక్కుని చిన్నారి మృతి
-
స్కూల్ లిఫ్ట్‌లో ఇరుక్కుని చిన్నారి మృతి
హైదరాబాద్: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ లిఫ్ట్‌లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి జెహాన అక్కడికక్కడే మరణించింది. లిఫ్ట్‌లోని గ్యాప్‌లో చిక్కుకోవడంతో చిన్నారి తల తెగిపోయింది. మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన జెహాన .. తోటి విద్యార్థులతో కలసి పైఅంతస్తులోని తరగతి గదికి లిఫ్ట్‌లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లిఫ్ట్ గ్యాప్‌లో ఇరుక్కోవడంతో జెహాన విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి శరీరం లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లిన పాప అంతలోనే మరణించిదన్న వార్త తెలియడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.