హైదరాబాద్ సిటీ: మీర్‌పేట ఎస్‌ఐ తన కుమారుడిని తీసుకెళ్లి ఆసుపత్రి పాలు చేశాడని ఓ తల్లి మానవహక్కుల కమిషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. వివరాలు.. మీర్‌పేట్‌లోని లెనిన్‌నగర్‌కు చెందిన శివకుమార్ పెయింటింగ్ పనిచేస్తుంటాడు. సరూర్‌నగర్, మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లలో పలుదొంగతనాల కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు. వెహికల్ చెకింగ్‌లో భాగంగా మీర్‌పేట్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా దొంగిలించిన బైక్‌తో వారం రోజుల కింద పట్టుబడ్డాడు. అతడిని విచారించగా మరో రెండు బైకులు, ఒక ల్యాప్‌టాప్‌లు దొంగిలించినట్లు తెలిసిందని, చోరీ కాబడిన మరో బైక్ వివరాలు చెప్పమని విచారిస్తుండగా బాత్రూంకు వెళ్లి యాసిడ్ తాగాడని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు చికిత్స నిమిత్తం ఆ యువకుడిని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడు నెలన్నర నుంచి తమ ఇంట్లోనే ఉంటున్నాడని, నెల రోజుల కిందట ఇంట్లో గ్యాస్ స్టౌ పేలడంతో గాయాలయ్యాయని, స్తోమత లేక ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడని కుటుంబసభ్యులు అంటున్నారు. చావుబతుకుల మధ్య తమ కుమారుడు కొట్టుమిట్టాడుతున్నాడని ఈ విషయంలో ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు.
కుమారుడిని రక్షించాలంటూ తల్లి ఫిర్యాదు
Published Fri, Aug 7 2015 6:23 PM | Last Updated on Thu, Oct 4 2018 8:38 PM
Advertisement